AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని మోడీ పెద్ద పీట.. పూర్వ వైభవం సంతరించుకోనున్న కాశీ నగరం..

ప్రధానమంత్రి మోడీకి మొదటి నుంచి భారత సంస్కృతి, సంప్రదాయాలు అంటే గౌరవం ఎక్కువ. ఆయన ఖచ్చితంగా భారతీయ సంప్రదాయాలను పాటిస్తారు. ముఖ్యంగా మోడీకి ఆధ్యాత్మిక నగరమైన కాశీతో లోతైన అనుబంధం ఉంది...

PM Modi: భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని మోడీ పెద్ద పీట.. పూర్వ వైభవం సంతరించుకోనున్న కాశీ నగరం..
Modi
Srinivas Chekkilla
|

Updated on: Dec 11, 2021 | 2:09 PM

Share

ప్రధానమంత్రి మోడీకి మొదటి నుంచి భారత సంస్కృతి, సంప్రదాయాలు అంటే గౌరవం ఎక్కువ. ఆయన ఖచ్చితంగా భారతీయ సంప్రదాయాలను పాటిస్తారు. ముఖ్యంగా మోడీకి ఆధ్యాత్మిక నగరమైన కాశీతో లోతైన అనుబంధం ఉంది. ఆయన ప్రధాని కాకముందు బాబా విశ్వనాథ్‎ను దర్శించుకోవడాని చాలాసార్లు వచ్చారు. ప్రధాని అయిన తర్వాత కూడా కాశీని సందర్శించారు. కాశీ నగరం ఆధ్యాత్మికతను మరింత పెంపొందించాడానికి, కాశీ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మోడీ నడుం బిగించారు. విశ్వనాథ్ మందిరాన్ని అత్యన్నతంగా తీర్చిదిద్దడం ప్రధాని మోదీ జీవితకాల కలగా ఉంది. ఆ దిశగా కాశీ అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు.

అందులో భాగంగా డిసెంబర్ 13న వారణాసిలో పర్యటించనున్నారు. కాశీ-విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. సంస్కృతి, వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని కాశీని అభివృద్ధి చేస్తున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ కాశీ విశ్వనాథ దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మారుస్తుంది. 20-25 అడుగుల వెడల్పు గల కారిడార్ గంగా నదిపై లలితా ఘాట్‌ను ఆలయ ప్రాంగణంలోని మందిర్ చౌక్‌కు కలుపుతుంది. పురాతన కాలం వలె ఒక భక్తుడైన ప్రతిరోజు ఉదయం పవిత్ర నదిలో స్నానం చేసి ఆలయంలోని శివునికి పూజలు చేయవచ్చు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ ఆలయ సముదాయాన్ని సుందరీకరించడానికి అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇటీవల ప్రధాని మోడీ సోమనాథ్ ఆలయ సముదాయంలో సముద్రతీర ప్రొమెనేడ్, ఎగ్జిబిషన్ సెంటర్‌ను ప్రారంభించారు. 2013 వరదల్లో విస్తృతంగా విధ్వంసానికి గురైన కేదార్‌నాథ్ ధామ్‌ను మోడీ ప్రభుత్వం తిరిగి అభివృద్ధి చేసింది. ఇటీవలే కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణాన్ని మోడీ ప్రారంభించారు.

భారతదేశం మతపరమైన, దైవిక ప్రదేశాలకు పుర్వ వైభవం వచ్చినప్పుడే ఆధ్యాత్మిక మేల్కొలుపు వస్తుందని మోడీ నమ్ముతారు. అందుకే మత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాల వైభవాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా ఉన్న మన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాల ఆలయాల పునరుద్ధరణ డ్రైవ్‌ను ప్రారంభించారు. గత 20 సంవత్సరాలలో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. 9 నవంబర్ 2019న ఏడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కాలం తర్వాత రామజన్మభూమి కేసులో హిందువులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పు తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం రామ మందిర నిర్మాణానికి వేగంగా ముందుకు సాగింది. రామ మందిరానికి ప్రధాన మంత్రి మోడీ 2020 ఆగస్టులో శంకుస్థాపన చేశారు.

యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఆధునిక విస్తృతమైన చార్ ధామ్ రోడ్ నెట్‌వర్క్‌ను మోడీ ప్రభుత్వం మంజూరు చేసింది. చార్ ధామ్ రహదారి ఈ నాలుగు పవిత్ర స్థలాలను సందర్శించేందుకు యాత్రికులకు ఉపయోగపడనుంది. రోడ్డు నెట్‌వర్క్‌కు సమాంతరంగా, రైల్వే లైన్‌లో పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. పవిత్ర నగరమైన రిషికేశ్‌ను కర్ణప్రయాగ్‌తో అనుసంధానించడానికి మోడీ ప్రభుత్వం పని చేస్తుంది. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని అనేక మతపరమైన ప్రదేశాల పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం బిగించింది. కాశ్మీర్‎లో మొత్తం1,842 దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాలు, గుహలు ఉన్నాయి. 952 ఆలయాల్లో 212 నడుస్తుండగా 740 శిథిలావస్థలో ఉన్నాయి. శ్రీనగర్‌లోని జీలం నది ఒడ్డున ఉన్న రఘునాథ్ ఆలయాన్ని ఇప్పిటికే పునరుద్ధరించారు. మోడీ దూరదృష్టితో ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మకతకు పునాది వేస్తున్నారు.

Read Also.. PM Modi: యూపీలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించనున్న మోడీ.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అంటూ ట్వీట్..