Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: యూపీలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించనున్న మోడీ.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అంటూ ట్వీట్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం యూపీలోని బలరాంపూర్ జిల్లాలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. 6,623 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ.. 14 లక్షల హెక్టార్లకు పైగా భూమికి సాగునీరు అందించనుంది...

PM Modi: యూపీలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించనున్న మోడీ.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అంటూ ట్వీట్..
Modi
Follow us
Srinivas Chekkilla

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:14 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం యూపీలోని బలరాంపూర్ జిల్లాలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. 6,623 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ.. 14 లక్షల హెక్టార్లకు పైగా భూమికి సాగునీరు అందించనుంది. ఈ కాలువతో తొమ్మిది జిల్లాలకు చెందిన 29 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. బహ్రైచ్, శ్రావస్తి, గోండా, బలరాంపూర్, సిద్ధార్థనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్ జిల్లాలు లబ్ధి పొందనున్నాయి.

1978లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనప్పటికీ, బడ్జెట్, తగిన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆలస్యమైందని, నాలుగు దశాబ్దాలు దాటినా పూర్తి కాలేదని పీఎంఓ పేర్కొంది. ప్రధాని మోదీ ప్రభుత్వం తర్వాత వచ్చిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతమైందని చెప్పింది. ఈ ప్రాజెక్టు మొత్తం రూ. 9,800 కోట్ల వ్యయంతో చేపట్టగా గత నాలుగేళ్లలో రూ. 4,600 కోట్లకు పైగా నిధులు కేటాయించామని చెప్పింది. నాలుగు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

సరయూ నహర్ జాతీయ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు

• ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు నదులను-ఘఘరా, సరయూ, రాప్తి, బంగంగా, రోహిణిలను అనుసంధానం చేశారు. 6,600కిలోమీటర్ల పొడవునా ఉప కాలువలను 318కిలోమీటర్ల ప్రధాన కాలువకు అనుసంధానం చేశారు.

• ఈ ప్రాజెక్ట్ 14 లక్షల హెక్టార్లకు పైగా భూమికి సాగు నీటిని అందిస్తుంది. 6,200 కంటే ఎక్కువ గ్రామాలకు చెందిన 29 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది.

• తూర్పు ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బీజేపీ ప్రభుత్వ వాగ్దానంలో ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన మైలురాయి.

• కాలువ వ్యవస్థ తూర్పు UP జిల్లాలను వరదల నుండి కూడా కాపాడుతుందని కూడా భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో శనివారం సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తున్న సందర్భంలో వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తమ ఏడాదిపాటు చేస్తున్న ఆందోళనను విరమించుకుని రైతులు ఢిల్లీ సరిహద్దు నుంచి తమ గ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలోభారీ ప్రచారాన్ని ప్రారంభించింది.

Read Also.. Omicron: సింగపూర్‌ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ఊరట.. ఆ విషయంలో ఇండియా కీలక నిర్ణయం