Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19 Omicron: దేశంలో కొత్త వేరింట్ కలవరం.. పెరుగుతున్న కరోనా కేసులు.. మరోసారి ఆంక్షల దిశగా కేంద్రం!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొత్త రూపం మళ్లీ కలవరపెడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆంక్షల దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా కొత్త ఆంక్షలు విధించాలంటూ అయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.

Covid 19 Omicron: దేశంలో కొత్త వేరింట్ కలవరం.. పెరుగుతున్న కరోనా కేసులు.. మరోసారి ఆంక్షల దిశగా కేంద్రం!
Minister Rajesh Bhushan
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 11, 2021 | 3:08 PM

Centre New Rules to Covid 19 Omicron: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొత్త రూపం మళ్లీ కలవరపెడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆంక్షల దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా కొత్త ఆంక్షలు విధించాలంటూ అయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. గత రెండు వారాల్లో అధిక కోవిడ్ పాజిటివిటీ రేటు నమోదవుతున్న జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూలతో సహా మరిన్ని నియంత్రణలను కేంద్రం సూచించింది. అన్ని రాష్ట్రాలు,యూటీల ప్రధాన కార్యదర్శులు, అడ్మినిస్ట్రేటర్‌లకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. గత 2 వారాల్లో అధిక కోవిడ్ పాజిటివ్ రేట్లు నమోదవుతున్న 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలోని 27 జిల్లాలను చాలా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్‌ నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదని, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు.

దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రం లేఖలో పేర్కొంది. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మిగతా 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు పేర్కొంది.

‘‘ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కన్పిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టాలి. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్‌ పెంచాలి. కంటైన్మెంట్‌ జోన్లుగా పరిగణించి.. రాత్రి కర్ఫ్యూ విధించాలి. జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలి’’ అని రాజేశ్ భూషణ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. తాజాగా దేశ రాజధాని దిల్లీలో ఈ వేరియంట్‌ రెండో కేసు నమోదైంది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 33కు చేరింది.