Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Alikhan: అతను చాలా హాట్‌ అంటూ టాలీవుడ్‌ క్రేజీ హీరోపై బాలీవుడ్‌ బ్యూటీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఆటిట్యూడ్‌తో అనతికాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ యంగ్‌ హీరో

Sara Alikhan: అతను చాలా హాట్‌ అంటూ టాలీవుడ్‌ క్రేజీ హీరోపై బాలీవుడ్‌ బ్యూటీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2021 | 2:34 PM

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఆటిట్యూడ్‌తో అనతికాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ యంగ్‌ హీరో. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా విజయ్‌ మారిపోయాడు. అతనిని ఇష్టపడేవారిలో అభిమానులే కాదు ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందులో బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌ కూడా ఒకరు. గతంలోనే విజయ్‌ దేవరకొండ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా రౌడీపై మరోసారి తన అభిమానాన్ని చాటుకుంది. ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అత్రంగిరే’ ప్రమోషన్లలో పాల్గొంటోన్న సారా విజయ్‌పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా ‘దక్షిణాదిలో ఏ హీరోతో యాక్ట్‌ చేయాలని ఉంది’ అని సారాను అడగ్గా వెంటనే విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చెప్పేసిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు విజ‌య్ చాలా హాట్‌గా ఉంటాడ‌ంటూ తన మన‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది. విజయ్‌ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ సినిమాలో నటిస్తోన్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా నిర్వహించిన ఓ పార్టీలో విజయ్‌- సారాలు మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో విజయ్‌తో క్లోజ్‌గా సెల్ఫీ దిగిన సారా వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా ‘లైగర్‌’ సినిమాకు హిందీలో కరణ్‌జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read:

ఏపీ ప్రభుత్వానికి RRR మూవీ టీమ్ విన్నపం.. లైవ్ వీడియో

చక్కనైన చిరునవ్వుతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టండి!

Alia Bhatt: అలియా భట్ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్