డిజిటల్‌ చెల్లింపులకు UPI బెస్టా NEFT బెస్టా.. రెండిటి మధ్య తేడాలేంటి..?

UPI or NEFT: UPI, NEFT రెండూ డిజిటల్ చెల్లింపు పద్ధతులు. UPI అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం పొందింది.

డిజిటల్‌ చెల్లింపులకు UPI బెస్టా NEFT బెస్టా.. రెండిటి మధ్య తేడాలేంటి..?
Upi Transactions
Follow us
uppula Raju

|

Updated on: Dec 11, 2021 | 7:56 PM

UPI or NEFT: UPI, NEFT రెండూ డిజిటల్ చెల్లింపు పద్ధతులు. UPI అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం పొందింది. ప్రజలు మొబైల్ సహాయంతో కూడా చెల్లింపులు చేస్తున్నారు. పని ఆలస్యం లేకుండా జరుగుతుంది. మొబైల్ ఫోన్‌లో UPI ప్రారంభించబడిన యాప్ ఉండాలి. మీరు UPIతో వేరొకరి ఖాతాకు కూడా డబ్బు పంపవచ్చు. NEFTకి కూడా ఇదే విధమైన వ్యవస్థ ఉంది. దీని ద్వారా నిధులు బదిలీ చేయవచ్చు. రెండిటి పని ఒకేలా ఉంటుంది. కానీ కొన్ని తేడాలు ఉంటాయి. రెండు వ్యవస్థలలో డబ్బు పంపే విధానంలో కొంచెం తేడా ఉంటుంది. UPI స్కానర్, మొబైల్ నంబర్ లేదా UPI ID సహాయంతో డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు. NEFT నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అనేది ప్రధానంగా ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ పద్దతి. ఇది ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరొక బ్యాంకుకు డబ్బును బదిలీ చేస్తుంది.

రెండింటి మధ్య వ్యత్యాసం NEFT నుంచి నిధుల బదిలీకి గరిష్టంగా 12 గంటల సమయం పడుతుంది. అలాగే NEFT ద్వారా ఫండ్ లావాదేవీలకు ఛార్జీలు, GST చెల్లించాలి. UPI సేవ ఏదైనా UPI యాప్ నుంచి చేసుకోవచ్చు. అయితే NEFT ద్వారా అయితే మొబైల్‌లో డబ్బు పంపుతున్న బ్యాంక్ యాప్ ఉండాలి. UPI సేవ కోసం UPI ID అవసరం. NEFT కోసం ఖాతా నంబర్ IFSC కోడ్ అవసరం.

ఛార్జ్ పరంగా ఏది మంచిది మీరు UPI ద్వారా డబ్బు పంపవచ్చు, తీసుకోవచ్చు. అదే NEFT ద్వారా చెల్లింపు లావాదేవీలు మాత్రమే చేస్తారు. మీకు బ్యాంక్ ఖాతా లేకపోయినా మీరు UPI చెల్లింపులు చేయవచ్చు. ఈ-వాలెట్ ద్వారా పని జరుగుతుంది. మీకు బ్యాంక్ ఖాతా ఉంటేనే NEFT ద్వారా మనీ ట్రాన్స్‌పర్ జరుగుతుంది. UPI ద్వారా 20 లావాదేవీల వరకు ఎటువంటి ఛార్జీ ఉండదు. ఆ తర్వాత నెలలో, రూ. 2.5-5 వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. UPI లావాదేవీ మరింత సురక్షితం ఒకే క్లిక్‌తో పని ముగుస్తుంది. UPI ద్వారా డబ్బు పంపాలనుకునే వ్యక్తి బ్యాంక్ ఖాతా లేదా PIN తెలుసుకోవలసిన అవసరం లేదు. అంతేకాకుండా UPI యాప్‌లో అనేక విభిన్న బ్యాంక్ ఖాతాలను లింక్ చేయవచ్చు.

NEFT ప్రయోజనాలు ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు ఆన్‌లైన్ ఫండ్ బదిలీ విషయంలో NEFTకి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. అది శనివారం-ఆదివారం మరేదైనా సెలవుదినం అయినా సరే డబ్బు బదిలీ జరుగుతుంది. NEFTలో మోసం జరిగే అవకాశం లేనందున సురక్షితమైన మాధ్యమంగా పరిగణిస్తారు. NEFT ద్వారా నిధుల పంపడం ప్రారంభించిన తర్వాత రెండు పార్టీలకు మెస్సేజ్‌ వస్తుంది. రెండింటి ప్రయోజనాలను పరిశీలిస్తే కస్టమర్ ఏ ఆన్‌లైన్ ప్రక్రియను అవలంబిస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు తక్షణమే డబ్బు పంపాలనుకుంటే, అవతలి పక్షానికి వెంటనే డబ్బు అవసరం అయితే, UPI మెరుగైన మాధ్యమం. ఈ పని మొబైల్ నంబర్ నుంచి కూడా చేయవచ్చు. మీకు UPI యాప్ లేకపోతే మీరు NEFT ద్వారా కూడా నిధులను బదిలీ చేసుకోవచ్చు.

ఇదెక్కడి రోగమండి బాబు..! ఒక్కసారి వచ్చిందంటే పచ్చిగడ్డి తింటూ పశువులా ప్రవర్తిస్తారట..

ఆ తప్పు చేయవద్దు.. డబ్బులు పోగొట్టుకోవద్దు.. అలాంటి విషయాలపై జాగ్రత్త..

ఈ ఓపెనర్ మళ్లీ విఫలమయ్యాడు.. తిరిగి జట్టులోకి రావడం అనుమానమే..?