ఇదెక్కడి రోగమండి బాబు..! ఒక్కసారి వచ్చిందంటే పచ్చిగడ్డి తింటూ పశువులా ప్రవర్తిస్తారట..

Boanthropy Disorder: ఒక్కోసారి కొంతమంది ప్రవర్తన చూస్తే మనకి పశువులు గుర్తుకువస్తాయి. చాలా సందర్భాలలో పశువులా ప్రవర్తిస్తున్నాడంటూ

ఇదెక్కడి రోగమండి బాబు..! ఒక్కసారి వచ్చిందంటే పచ్చిగడ్డి తింటూ పశువులా ప్రవర్తిస్తారట..
Cow
Follow us
uppula Raju

|

Updated on: Dec 11, 2021 | 6:54 PM

Boanthropy Disorder: ఒక్కోసారి కొంతమంది ప్రవర్తన చూస్తే మనకి పశువులు గుర్తుకువస్తాయి. చాలా సందర్భాలలో పశువులా ప్రవర్తిస్తున్నాడంటూ తిట్టడం మనం చూసే ఉంటాం. అయితే ఒక వ్యక్తి నిజంగానే జంతువులా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది. నేను మనిషిని కాదు జంతువును అని చెబితే ఏమనిపిస్తుంది. ఒక జంతువు తినే ఆహారం తింటూ ఒక జంతువులా ప్రవర్తిస్తే ఏం చేస్తారు.. వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది కదూ.. వాస్తవానికి మనిషి నిజంగానే జంతువులా ప్రవర్తించే రోగం ఒకటి ఉంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఈ వ్యాధి వస్తే మనిషి తనను తాను జంతువుగా భావిస్తాడు. జంతువు చేష్టలు చేస్తాడు. కాళ్లు, చేతులు పట్టుకొని జంతువులా నడవడం ప్రారంభిస్తాడు. గడ్డి తింటాడు. పూర్తిగా జంతువులా మారిపోతాడు. అవును కొంతమంది మానవులు మానసిక రుగ్మతలు కలిగి ఉంటారు. ఇందులో ఆ వ్యక్తి తనను తాను ఆవు లేదా ఎద్దుగా భావిస్తాడు. ఇది ఒక రకమైన వ్యాధి. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. ఈ మానసిక రుగ్మత పేరు బోనాంత్రోపీ. ఇది ఒక రకమైన జెనాంత్రోపీ. ఇది చాలా అరుదైన రుగ్మత. ఈ మానసిక రుగ్మత మనిషిని జంతువులా స్పందించేలా చేస్తుంది.

ఈ వ్యాధిలో ఏం జరుగుతుంది? ఎవరికైనా ఈ రుగ్మత ఉంటే అతను ఆవులా ప్రవర్తిస్తాడు. నాలుగు కాళ్లు ఉన్నట్లు జంతువులా నడుస్తాడు గడ్డి తింటాడు. ఆవు ఆహారాన్ని ఇష్టపడతాడు. ఎంతగా అంటే ఈ పరిస్థితిలో వ్యక్తి మాట్లాడటం మానేసి పచ్చిక బయళ్లలో తిరుగుతూ పచ్చిగడ్డి తినడానికి ఇష్టపడతాడు. తమను గోవులుగా భావించి దానికనుగుణంగా తమ జీవితాన్ని గడపడం ప్రారంభిస్తాడు. అయితే ఆ వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు తను ఆవులా ప్రవర్తిస్తున్నట్లు అతడికి తెలియదు. ఈ వింత మానసిక రుగ్మత కలల వల్ల వస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. అయితే కొంతమంది ఈ రుగ్మతకు మతపరమైన కోణాన్ని ఆపాదిస్తారు. దీనిని బ్లాక్‌మ్యాజిక్, చేతబడి అని చెబుతారు. ప్రసిద్ధ వ్యక్తులలో నియో-బాబిలోనియన్ రాజుగా ఉన్నప్పుడు ఈ వ్యాధికి బాధితుడు. అతను 605 BC నుంచి 562 BC వరకు పారిపాలన చేశాడు.

ఆ తప్పు చేయవద్దు.. డబ్బులు పోగొట్టుకోవద్దు.. అలాంటి విషయాలపై జాగ్రత్త..

ఈ ఓపెనర్ మళ్లీ విఫలమయ్యాడు.. తిరిగి జట్టులోకి రావడం అనుమానమే..?

LPG Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త..! ఇలా చేస్తే ధర తగ్గుతోంది..