AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో ఒంటరి ఇల్లు.. 100 ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది.. కారణమేంటో తెలుసా..?

Loneliest House:ఈ భూమిపై చాలా ఆశ్చర్యకరమైన ప్రదేశాలున్నాయి. కొన్ని చోట్ల జనం పెద్ద సంఖ్యలో ఉంటే మరికొన్ని చోట్ల ఎవ్వరూ ఉండరు. అయితే

ప్రపంచంలో ఒంటరి ఇల్లు.. 100 ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది.. కారణమేంటో తెలుసా..?
World Loneliest House
uppula Raju
|

Updated on: Dec 11, 2021 | 9:18 PM

Share

Loneliest House:ఈ భూమిపై చాలా ఆశ్చర్యకరమైన ప్రదేశాలున్నాయి. కొన్ని చోట్ల జనం పెద్ద సంఖ్యలో ఉంటే మరికొన్ని చోట్ల ఎవ్వరూ ఉండరు. అయితే 100 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్న ఒక ఇల్లు ఇటలీలో గుర్తించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఈ ఇల్లు భారీ డోలమైట్ పర్వతాల మధ్యలో నిర్మించారు. దీనిని ‘ప్రపంచంలోని ఒంటరి ఇల్లు’ అని పిలుస్తారు. ఈ ఇల్లు సముద్ర మట్టానికి దాదాపు 9,000 అడుగుల ఎత్తులో నిర్మించారని తెలిస్తే షాక్ అవుతారు. ఇంత ఎత్తులో ఇల్లు ఎలా నిర్మించారు.. ఎందుకు నిర్మించారు ఇక్కడ ఎవరు ఉండేవారు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

ఈ ఇంటిని మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించారని చెబుతారు. ఆస్ట్రో-హంగేరియన్ సైన్యంతో జరిగిన యుద్ధంలో ఇటాలియన్ సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి ఇంత ఎత్తులో నిర్మించారని చరిత్ర కారులు చెప్పారు. వారు ఈ ఇంటిని స్టోర్ రూమ్‌గా కూడా ఉపయోగించారు. ఇక్కడ సైనికుల కోసం తీసుకువచ్చిన అవసరాలు కూడా భద్రంగా ఉన్నాయి. ఈ ఇల్లు పూర్తిగా భిన్నమైన రీతిలో నిర్మించారు. దీని నిర్మాణంలో చెక్క, తాడు, కేబుల్ ఉపయోగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లు నిర్మించి 100 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ ఈ ఇల్లు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. పర్వతం మధ్యలో ఈ ఇల్లు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ ఇంటి చుట్టూ పర్వతాలు తప్ప మరేమీ కనిపించవు. దీనివల్ల ప్రజలు ఇక్కడికి రావడం లేదు. ఇక్కడికి చేరుకునే మార్గం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. ఒక పాత చెక్క వంతెనను దాటాలి. ఇది ఇక్కడికి చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం. గొప్పదనం ఏంటంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మరో లోకంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ప్రమాదం కారణంగా ప్రజలు ఇక్కడికి రాకుండా సాధారణంగా నిషేధించినా సాహసాలను ఇష్టపడే వ్యక్తులు ఇక్కడికి వెళ్లాలని ఆలోచిస్తుంటే సొంత పూచీతో వెళ్లాలని తెలిపారు.

ప్రయాణికుల కోసం అక్కడి రైల్వే స్టేషన్‌లో ఆ సేవలు ప్రారంభం.. సమయం ఆదా ఛార్జీలు తక్కువే..

డిజిటల్‌ చెల్లింపులకు UPI బెస్టా NEFT బెస్టా.. రెండిటి మధ్య తేడాలేంటి..?

ఇదెక్కడి రోగమండి బాబు..! ఒక్కసారి వచ్చిందంటే పచ్చిగడ్డి తింటూ పశువులా ప్రవర్తిస్తారట..