Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Crying: గుక్కపెట్టి ఏడుస్తున్న కోడిపిల్ల.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Chicken Crying: గుక్కపెట్టి ఏడుస్తున్న కోడిపిల్ల.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Anil kumar poka

|

Updated on: Dec 17, 2021 | 9:48 AM

సోషల్ మీడియాలో తరచూ మనం ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. ఇప్పడు మనం చూడబోయే వీడియోలో ఒక కోడిపిల్ల గుక్క పెట్టి ఏడుస్తుంది. పాపం దానికి ఏం బాధ కలిగిందో ఏమో.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.


సోషల్ మీడియాలో తరచూ మనం ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. ఇప్పడు మనం చూడబోయే వీడియోలో ఒక కోడిపిల్ల గుక్క పెట్టి ఏడుస్తుంది. పాపం దానికి ఏం బాధ కలిగిందో ఏమో.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు వీడియోను చూసి షాకవుతున్నారు.. ఎందుకో ఏంటో.. మీరూ చూసేయండి…ఈ వీడియోలో కనిపిస్తున్న టర్కీజాతి కోడిపిల్లని చూడగానే ఏదో బాధతో విలపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. దాని బాధాతప్త హావభావాలను చూసి.. ఇక నుంచి మేం శాకాహారులుగా మారిపోయామంటూ ప్రకటించేశారు. నవంబర్ 24న జాన్ ఒబెర్గ్ అనే ట్విట్టర్ యూజర్.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఎవరైనా టర్కీ చికెన్ తినాలని ప్లాన్ చేస్తే, ఈ వీడియో చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు.’’ అని క్యాప్షన్ పెట్టారు. జాన్ షేర్ చేసిన ఈ పోస్ట్‌ను సుమారు వేలాది మంది లైక్‌చేస్తూ రీట్వీట్ చేశారు, సాధారణంగా ఫుడ్, డ్రింక్స్ విషయంలో ప్రతి ఒక్కరికీ వారి సొంత అభిప్రాయం ఉంటుంది. కొందరికి నాన్ వెజ్ అంటే ఇష్టం, మరికొందరికి వెజ్ అంటే ఇష్టం. చాలా మంది చికెన్ తినడానికి ఇష్టపడతారు. అయితే జాన్ ఒబెర్గ్ చేసిన ఈ వీడియో పోస్ట్ తర్వాత, చాలా మంది మాంసాహారులు కూడా ఎమోషనల్ అయిపోయారు. తమ అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు. ఇంతకీ ఆ వీడియో అంతలా ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..వీడియోలో టర్కీ చికెన్.. ఒక వ్యక్తి ఒడిలో కళ్ళు మూసుకుని పడుకుంది. ఈ కోడిపిల్లను చూస్తే చాలా భయపడిపోయి ఏడుస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. తాను సురక్షితమైన ప్లేస్‌లో ఉన్నట్లు ఆ కోడి భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది. వీడియోలోని వ్యక్తి కోడి తలపై చేయితో ఓదారుస్తున్నట్లు నిమురుతుండగా.. అది హాయిగా సేద తీరింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఈ వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక నుంచి తాము శాకాహారిగా మారిపోతున్నట్లు ప్రకటించారు కొందరు నెటిజన్లు.

Published on: Dec 12, 2021 09:45 AM