Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు.. చాలా డబ్బు సంపాదిస్తారు.. మీరు ఈ జాబితాలో ఉన్నారా..

Numerology: న్యూమరాలజీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన శాఖగా గుర్తింపు పొందింది. జాతకంలో రాశి, గ్రహాలు, నక్షత్రాలు, మన జీవితాన్ని

ఈ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు.. చాలా డబ్బు సంపాదిస్తారు.. మీరు ఈ జాబితాలో ఉన్నారా..
Numerology
Follow us
uppula Raju

|

Updated on: Dec 12, 2021 | 8:47 AM

Numerology: న్యూమరాలజీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన శాఖగా గుర్తింపు పొందింది. జాతకంలో రాశి, గ్రహాలు, నక్షత్రాలు, మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, అదే విధంగా మనం పుట్టిన తేదీ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని వీరి నమ్మకం. సంఖ్యాశాస్త్రంలో అంకెలు 1 నుంచి 9 వరకు ఉంటాయి. రాశిచక్రం వలె అన్ని రాడిక్స్ సంబంధాలు కూడా నవగ్రహాలలో ఏదో ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది. దీంతో ఆ వ్యక్తి జీవితంపై ఆ గ్రహం ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం అదృష్టవంతులుగా పరిగణించబడే వ్యక్తుల గురించి తెలుసుకుందాం. జీవితంలో ఏ రంగంలోకి వెళ్లినా వారు ఎంతో పేరు, డబ్బు సంపాదిస్తారు.

ఈ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు సంఖ్యాశాస్త్రంలో సంఖ్య 9 చాలా ప్రభావవంతమైన, బలమైన, అదృష్ట సంఖ్యగా చెబుతారు. మీరు నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించినట్లయితే మీరు 9 రాడిక్స్‌తో పిలుస్తారు. రాడిక్స్‌ ఎలా వస్తుందంటే మీ పుట్టిన తేదీ అంకెలను కలపడం ద్వారా వస్తుంది. ఉదాహరణకు మీరు 27వ తేదీన జన్మించినట్లయితే, 2+7=9 వస్తుంది.

వీరి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు న్యూమరాలజీ ప్రకారం.. రాడిక్స్ నంబర్ 9 ఉన్న వ్యక్తులు చాలా తెలివైనవారు, బలమైన శక్తిని కలిగి ఉంటారు. జీవితంలో ఏది సాధించాలనుకున్నా, దాన్ని సాధించి ఊపిరి పీల్చుకుంటారు. ఈ మేధస్సు, బలమైన శక్తి కలయిక వారికి జీవితంలో చాలా పురోగతిని ఇస్తుంది. వారు ఎక్కడికి వెళ్లినా ఉన్నత స్థానాలను పొందుతారు. పరిపాలనలో కూడా పెద్ద స్థానం పొందుతారు. అందుకే వారు చాలా పేరు, కీర్తి, డబ్బు సంపాదిస్తారు. వారి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.

సంపదతో జీవితాన్ని గడపండి 9వ సంఖ్య గల వ్యక్తులు తమ జీవితాన్ని సంపదతో గడపడానికి ఇష్టపడతారు. వారు కుటుంబం, స్నేహితుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. వారి జీవనం, ఆహారం, ప్రతిదీ అత్యున్నతమైనది. ఈ వ్యక్తులు చాలా ధైర్యవంతులు, స్వభావంలో కోపంగా ఉంటారు. అయితే వారి గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. వారు తమ సొంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతారు. అయితే, వారి వైవాహిక జీవితంలో గందరగోళ పరిస్థితులు మాత్రం నెలకొంటాయి.

పరీక్షలంటే అందరికీ భయమే.. కానీ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి..

పాత నాణేలు నిజంగానే లక్షలు పలుకుతాయా..! వాటికి ఎందుకంత డిమాండ్‌..? కారణం ఇదే..

ఈ 10 ఫైనాన్స్‌ కంపెనీలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి.. ఎంతంటే..?