AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fiber Cylinder: ఫైబర్ సిలిండర్ వచ్చేసింది.. బరువు చాలా తక్కువ.. ధర ఎంతంటే..

గ్యాస్ సిలిండర్‎ను మోయాలంటే చాలా ఇబ్బంది. ఒకటి, రెండు, మూడు అంతస్థుల్లో ఉన్నవారు సిలిండర్ పైకి తీసుకెళ్లాలంటే చెమటోర్చాల్సిందే.. అయితే ఇప్పుడు ఆ శ్రమ తప్పనుంది...

Fiber Cylinder: ఫైబర్ సిలిండర్ వచ్చేసింది.. బరువు చాలా తక్కువ.. ధర ఎంతంటే..
Fiber Cylinder
Srinivas Chekkilla
|

Updated on: Dec 12, 2021 | 11:07 AM

Share

గ్యాస్ సిలిండర్‎ను మోయాలంటే చాలా ఇబ్బంది. ఒకటి, రెండు, మూడు అంతస్థుల్లో ఉన్నవారు సిలిండర్ పైకి తీసుకెళ్లాలంటే చెమటోర్చాల్సిందే.. అయితే ఇప్పుడు ఆ శ్రమ తప్పనుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇనుముతో తయారు చేసిన ఎల్‌పీజీ సిలిండర్ల స్థానంలో.. ఫైబర్‌(స్మార్ట్‌) సిలిండర్లు వచ్చేశాయి. ఇండేన్‌ సంస్థ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి విక్రయిస్తోంది. అయితే ఇందులో కేవలం 10 కిలోలు, 5 కిలోలు మాత్రమే ఉన్నాయి. వీటి ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. 10 కిలోల ఫైబర్ సిలిండర్‎కు రూ.3,350 ఉండగా.. 5 కిలోల సిలిండర్‎కు రూ.2,150 అడ్వాన్స్ చెల్లించాలి.

వినియోగదారులు ఇప్పటికే వాడుతున్న పాత సిలిండర్లను తిరిగి ఇచ్చి వీటిని తీసుకోవచ్చని ఇండేన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. బుకింగ్‌ చేసుకున్న గంటల వ్యవధిలోనే ఇళ్లకు సరఫరా చేస్తామన్నారు. నెక్లెస్‌ రోడ్డులో నిర్వహిస్తున్న ‘గో ఎలక్ట్రిక్‌ ఎక్స్‌పో’లో ఇండేన్‌ సంస్థ ఈ కొత్త సిలిండర్లను ప్రదర్శించింది. రూ.670 చెల్లించి 10 కిలోల సిలిండర్‌, రూ.330 చెల్లించి ఐదు కిలోల సిలిండర్‌లో గ్యాస్‌ నింపించుకోవచ్చని చెప్పారు.

ఇనుముతో తయారు చేసిన సిలిండర్ పైకి ఎత్తడం కష్టం.. కానీ ఫైబర్ సిలిండర్ పైకి సులభంగా ఎత్తుకోవచ్చు. ఖాళీ ఇనుప సిలిండర్ బరువు 16 కిలోలు ఉండగా.. ఫైబర్ సిలిండర్ 6.3 కిలోలే ఉంటుంది. మామూలు సిలిండర్‎లో గ్యాస్ కనిపించదు. కానీ ఫైబర్ సిలిండర్‎లో గ్యాస్ కనిపిస్తుంది. ఇనుప సిలిండర్ మంటలు అంటుకుంటే పేలిపోయే ప్రమాదం ఉంది. కానీ ఫైబర్ సిలిండర్ పేలదు. ఇనుప సిలిండర్ తుప్పు పడుతుంది, మరలు ఏర్పడతాయి. కానీ ఫైబర్ సిలిండర్ ఎలాంటి మరకలు ఉండవు.

Read Also… PPF Account: పీపీఎఫ్ ఖాతాలో కూడా లోన్ తీసుకోవచ్చు.. వడ్డీ రేటు తక్కువే.. ఎలా తీసుకోవాలంటే..