10th,12th నుంచి MBBS వరకు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు.. త్వరలో దరఖాస్తు చేసుకోండి

Scholarships 2021: మంచి స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లు విద్యార్థి దిశను మార్చగలవు. ఆత్మవిశ్వాసాన్ని పెంచగలవు. అయితే

10th,12th నుంచి MBBS వరకు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు.. త్వరలో దరఖాస్తు చేసుకోండి
Scholarship Program
Follow us

|

Updated on: Dec 12, 2021 | 3:11 PM

Scholarships 2021: మంచి స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లు విద్యార్థి దిశను మార్చగలవు. ఆత్మవిశ్వాసాన్ని పెంచగలవు. అయితే ప్రతిభావంతులైన విద్యార్థులకు అనేక స్కాలర్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందడం ద్వారా కెరీర్‌లో ముందుకు సాగవచ్చు. ఆ తాజా స్కాలర్‌షిప్‌ల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. GSK స్కాలర్స్ ప్రోగ్రామ్ 2021-22 GSK స్కాలర్స్ ప్రోగ్రామ్ 2021-22 భారతదేశంలోని ప్రభుత్వ కళాశాలల నుంచి MBBS మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థుల వరక స్కాలర్ షిప్‌లను అందిస్తోంది. ప్రతిభావంతులైన, ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ 31 డిసెంబర్ 2021. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి, ముఖ్యమైన అర్హతలు ఇలా ఉన్నాయి.

ముఖ్యమైన అర్హత – 12వ తరగతిలో కనీసం 65% మార్కులతో MBBS మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం అన్ని మూలాల నుంచి INR 6,00,000 (6 లక్షలు) కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు చేయడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి. www.b4s.in/it/GSKP1

2. IIT రూర్కీ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ (DOF) పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ 2021 IIT రూర్కీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ (DoF) పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ (PDF) 2021 అనేది PhD డిగ్రీ హోల్డర్‌లకు అందించే రీసెర్చ్ ఫెలోషిప్. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 25. మంచి అకడమిక్ రికార్డ్, కనీసం రెండు SCI ప్రచురణలు, సెల్ కల్చర్‌లో, బయోటెక్నాలజీలో PhD డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు INR 60,000 వరకు స్కాలర్‌ షిప్‌ అందిస్తారు. దరఖాస్తు చేయడానికి క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి. Url: https://www.iitr.ac.in/administration/uploads/File/ch/2021/adv261120211.

3. కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021-22 కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ యువ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ పొందే అవకాశాన్ని అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ వివిధ పోస్ట్-మెట్రిక్యులేషన్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో చదువుతున్న విద్యార్థులకు నచ్చిన కెరీర్ వైపు వెళ్ళడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. 2021 బోర్డు పరీక్షలో కనీసం 75% మార్కులతో, 12వ తరగతి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు 3-సంవత్సరాల గ్రాడ్యుయేషన్, 4-సంవత్సరాల ఇంజనీరింగ్, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు అర్హులు. మీరు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 31.

కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి INR 5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు వారి ప్రస్తుత విద్యా స్థాయిని బట్టి 4 సంవత్సరాల వరకు సంవత్సరానికి రూ.30,000 వరకు స్కాలర్‌షిప్ అవార్డును అందిస్తారు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు www.b4s.in/it/KISF1 .

IBPS SO Exam 2021: డిసెంబర్ 26న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌.. పరీక్షా సరళిని తెలుసుకోండి..

Hair Care: జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ‘ఈ’ తప్పనిసరి..! ఎందుకో తెలుసుకోండి..?

Yuvraj Singh: సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌.. అతడి రికార్డులు ఎవరికి సాధ్యం కావు..!