Electricity Consumption: డిసెంబర్‌లో పెరిగిన విద్యుత్ డిమాండ్.. ఎందుకంటే..
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డిసెంబర్ మొదటి 10 రోజుల్లో దేశంలో విద్యుత్ వినియోగం దాదాపు 1.3 శాతం పెరిగి 34.23 బిలియన్ యూనిట్లకు (BU) చేరుకుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది...
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డిసెంబర్ మొదటి 10 రోజుల్లో దేశంలో విద్యుత్ వినియోగం దాదాపు 1.3 శాతం పెరిగి 34.23 బిలియన్ యూనిట్లకు (BU) చేరుకుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాది ఇదే కాలంలో విద్యుత్ వినియోగం 33.78 బిలియన్ యూనిట్లు. 2020 డిసెంబర్ నెలలో మొత్తం విద్యుత్ వినియోగం 105.62 బిలియన్ యూనిట్లు కాగా.. డిసెంబర్ 2019లో ఇది 101.08 బిలియన్ యూనిట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగింది. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడమే డిసెంబర్‌లో విద్యుత్ డిమాండ్ మెరుగుపడటానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ మొదటి 10 రోజులలో, గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 169.12 GW వద్ద ఉంది.
ఈ ఏడాది నవంబర్‌లో విద్యుత్ వినియోగం 2.6 శాతం పెరిగి 99.37 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. గతేడాది నవంబర్‌లో ఈ వినియోగం 96.88 బిలియన్ యూనిట్లు కాగా, 2019 నవంబర్‌లో 93.94 బిలియన్ యూనిట్లుగా ఉంది. అక్టోబర్‌లో విద్యుత్ వినియోగం 3.3 శాతం పెరిగి 112.79 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో 109.17 బిలియన్ యూనిట్లుగా నమోదయ్యాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్-19 యొక్క రెండో వేవ్ తర్వాత, అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌కు డిమాండ్ తగ్గుముఖం పట్టింది. కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ ఏడాది మేలో విద్యుత్ వినియోగం 6.6 శాతం పెరిగి 108.80 యూనిట్లకు చేరుకుంది. మే, 2020లో ఇది 102.08 బిలియన్ యూనిట్లుగా ఉంది. జూన్‌లో విద్యుత్ వినియోగం దాదాపు తొమ్మిది శాతం పెరిగి 114.48 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. జూన్, 2020లో ఇది 105.08 బిలియన్ యూనిట్లుగా ఉంది.
Read Also… Multibagger Penny Stock: లక్ష రూపాయల పెట్టుబడి సంవత్సరంలో కోటి రూపాయలైంది.. ఎలాగంటే..