AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Penny Stock: లక్ష రూపాయల పెట్టుబడి సంవత్సరంలో కోటి రూపాయలైంది.. ఎలాగంటే..

గత రెండేళ్లలో పలు స్టాక్‌లు తమ వాటాదారులకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చాయి. పెన్నీ స్టాక్‌ల జాబితాకు చెందిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ ఒకటి...

Multibagger Penny Stock: లక్ష రూపాయల పెట్టుబడి సంవత్సరంలో కోటి రూపాయలైంది.. ఎలాగంటే..
Multibagger Stocks
Srinivas Chekkilla
|

Updated on: Dec 12, 2021 | 12:55 PM

Share

గత రెండేళ్లలో పలు స్టాక్‌లు తమ వాటాదారులకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చాయి. పెన్నీ స్టాక్‌ల జాబితాకు చెందిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ ఒకటి. ఈ స్టాక్ ఒక్కో షేరుకు రూ. 0.35 నుండి రూ.198.45కి పెరిగింది. మూడు సంవత్సరాల కాలంలో దాదాపు 567 రెట్లు పెరిగింది. ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ షేర్ ధరలు గత ఆరు నెలల్లో రూ. 10.37 నుండి రూ. 198.45లతు పెరిగాయి. ఈ కాలంలో దాదాపు 1,913 శాతం వరకు పెరిగాయి. గత సంవత్సరం డిసెంబర్ 14న ఈ షేరు ధర రూ.1.62 ఉండగా 2021 డిసెంబర్ 10 నాటికి రూ.198.45లకు చేరుకుంది. దీని ద్వారా దాని వాటాదారులకు దాదాపు 10,176 శాతం రాబడిని అందించింది.

ఒక పెట్టుబడిదారుడు మూడేళ్ల క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే దాని విలువ ఇప్పుడు 5.67 కోట్లకు చేరుకుంది. అక్టోబర్ 28, 2021న స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.216కి, డిసెంబర్ 8, 2020న 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.1.53కి చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభంలో 17.65% పతనాన్ని నివేదించింది. ఈ స్టాక్‎లో సంవత్సరం క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ప్రస్తుతం దాని విలువ 1.22 కోట్లుగా ఉంది.

Note: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఆర్థిక నిపుణుల సలహా మేరకే పెట్టుబడి పెటాలి.

Read also.. SBI: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. వ్యాపారులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి.