Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks closed: ఈ వారంలో బ్యాంకులు 2 రోజులు బంద్‌.. పనులు త్వరగా ముగించండి..

Banks closed: ఈ వారంలో మీకు బ్యాంకు పని ఏదైనా ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉంది.

Banks closed: ఈ వారంలో బ్యాంకులు 2 రోజులు బంద్‌.. పనులు త్వరగా ముగించండి..
Bank Strike
Follow us
uppula Raju

|

Updated on: Dec 13, 2021 | 7:37 AM

Banks closed: ఈ వారంలో మీకు బ్యాంకు పని ఏదైనా ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉంది. ఈ కారణంగా బ్యాంకులు 2 రోజులు బంద్‌ ఉంటాయి. దేశవ్యాప్త బ్యాంకు సమ్మె కారణంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పనితీరు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 10న ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో “యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) సమ్మె నోటీసు ఇచ్చినట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఎల్‌బిఎ) సమాచారం అందించింది” అని ఎస్‌బిఐ తెలిపింది. AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, INBOC వంటి UFBU సంఘాల సభ్యులు తమ డిమాండ్లకు మద్దతుగా 2021 డిసెంబర్ 16, 17 తేదీలలో దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు వెళ్లాలని సూచించారు. సమ్మె జరుగుతున్న రోజుల్లో ఎస్బీఐ తన శాఖలు, కార్యాలయాలు సాధారణ పనితీరును నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ సమ్మె కారణంగా బ్యాంక్‌లో కొన్ని పనులు నిలిచిపోయే అవకాశం ఉందని ప్రకటించింది.

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ.. 2021 బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయానికి నిరసనగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) డిసెంబర్ 16 నుంచి రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. UFBU కింద 9 బ్యాంకుల యూనియన్లు ఉన్నాయి. దీని ప్రకారం దేశంలోని మొత్తం డిపాజిట్లలో 70 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద ఉన్నాయి. వాటిని ప్రైవేట్ క్యాపిటల్‌కు అప్పగించడం వల్ల ఈ బ్యాంకులలో డిపాజిట్ చేయబడిన సామాన్యుల డబ్బు ఇబ్బందుల్లోకి వెళుతుంది.

బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయి 16 డిసెంబర్ – బ్యాంక్ సమ్మె 17 డిసెంబర్ – బ్యాంక్ సమ్మె 18 డిసెంబర్ – యు సో సో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేస్తారు) 19 డిసెంబర్ – ఆదివారం (వారపు సెలవు)

ఈ వారం, సోమవారం, మంగళవారం, బుధవారాల్లో బ్యాంక్ సాధారణ వ్యాపారం ఉంటుంది. అందుకే ఈ రోజు నుంచే బ్యాంకుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోండి. బ్యాంక్ సమ్మె ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పై ప్రభావం చూపదు. అన్ని బ్యాంకుల డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI ఆధారిత సేవలు, మొబైల్ బ్యాంకింగ్ మొదలైనవి యథావిధిగా పని చేస్తాయి.

Tomato Price: అక్కడ టమాటా, పెట్రోల్ కంటే బీర్ ధర తక్కువే.. ఎందుకంటే..

Omicron: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. పెరగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. ఇప్పటివరకు ఎన్నంటే?

Horoscope Today: నేడు ఈ రాశిలో వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు.. ఈరోజు రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..