Omicron: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. పెరగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. ఇప్పటివరకు ఎన్నంటే?

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు భారత్‌లో క్రమంగా పెరుగుతున్నాయి.. తాజాగా కర్ణాటకలో మూడో కేసు బయట పడగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛండీగఢ్, మహారాష్ట్ర ఒక్కో కేసు నమోదైయ్యాయి.

Omicron: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. పెరగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. ఇప్పటివరకు ఎన్నంటే?
Omicron
Follow us

|

Updated on: Dec 13, 2021 | 7:32 AM

Covid-19 Omicron in India: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు భారత్‌లో క్రమంగా పెరుగుతున్నాయి.. తాజాగా కర్ణాటకలో మూడో కేసు బయట పడగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛండీగఢ్, మహారాష్ట్ర ఒక్కో కేసు నమోదైయ్యాయి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 33కేసులు ఉండగా తాజా మరో 5 కేసులు బయట పడ్డాయి.. కర్ణాటకలో మూడో కేసు వెలుగు చూడగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛండీగఢ్, మహారాష్ట్ర ఒక్కో కేసు నమోదైయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. ఢిల్లీ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. చండీగఢ్‌లో బంధువులను కలిసేందుకు ఇటలీ నుంచి వచ్చిన యువకునికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.. అతని నమూనాలు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపింతే అక్కడ ఒమిక్రాన్‌ వేరియంట్‌గా తేల్చారు. అయితే, ఆ యువకుడిలో ఒమిక్రాన్‌ లక్షణాలు ఏవీ లేవని, ఇప్పటికే ఇటలీలో రెండు డోసుల టీకా తీసుకున్నాడని అధికారులు తెలిపారు..

ఇక దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటకకు వచ్చిన ఓ 34ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు 3కు చేరాయి.. మహారాష్ట్రలోని నాగపూర్‌లో తొలి ఒమిక్రాన్​ తొలి కేసు నమోదైంది. పశ్చిమ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి ఇది సోకింది మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల విజృంభనతో థర్డ్‌వేవ్‌ అనుమానాలు మొదలయ్యాయి.. అయితే కొత్త వేరియంట్‌ వచ్చినంత మాత్రాన దయనీయమైన పరిస్థితులు తలెత్తుతాయని భావించాల్సిన అవసరం లేదని అంటున్నారు డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌.. కొంత అనిశ్చత వాతావరణం అయితే ఉందన్నారు.. కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదని గుర్తు చేశారు పూనమ్‌.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది.. అయితే బూస్టర్ డోసు పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. మూడో డోసు పంపిణీ చేయాలని కొందరు.. తీసుకోకపోయినా ఫర్వాలేదని మరికొందరు అంటున్నారు.

Read Also… Andhra Pradesh: వారి నాలుకలు కోయాలి.. మాజీ మంత్రి పరిటాల సునిత సంచలన కామెంట్స్..