Omicron test: ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు కొత్త పరికరం.. అవిష్కరించిన ఐసీఎంఆర్.. గంటల్లోనే ఫలితం!

దేశవ్యాప్తంగా చాపకింద నీరులా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. క్రమంగా ఈ వేరియంట్ బాధితుల సంఖ్య పెరగుతోంది.

Omicron test: ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు కొత్త పరికరం.. అవిష్కరించిన ఐసీఎంఆర్.. గంటల్లోనే ఫలితం!
Omicron Test
Follow us

|

Updated on: Dec 13, 2021 | 8:03 AM

Omicron testing Kit:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠిన ఆంక్షల నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ తరుణంలో దక్షిణ ఆఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ మరోసారి కలవరపెడుతోంది. చాపకింద నీరులా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. క్రమంగా ఈ వేరియంట్ బాధితుల సంఖ్య పెరగుతోంది. విదేశాల నుంచి వచ్చేవారికి నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నప్పటికీ పీసీఆర్‌ టెస్టుల్లో వీటిని గుర్తించడం కష్టంగా మారింది. పాత పద్దతుల్లో వేరియంట్ గుర్తించడం వైద్య సిబ్బందికి కష్టంగా మారింది. వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ ను కట్టడిలో కొంత్ జాప్యం ఏర్పడుతోంది.

దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విరుచుకుపడేందుకు కోరలు చాస్తోంది. క్రమంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ రూపంలో వేగంగా వ్యాపించేందుకు సిద్ధమవుతోంది. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచింది. ఎక్కడికక్కడే నమూనాలను పరీక్షిస్తోంది. ముఖ్యమంగా విదేశీ ప్రయాణికుల పట్ల జాగ్రత్త వహిస్తోంది వైద్య, ఆరోగ్య శాఖ.

కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను నిర్ధారించేందుకు పాజిటివ్‌ వచ్చిన నమూనాలకు జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సి (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌) వస్తోంది. ఇందుకు దాదాపు మూడు, నాలుగు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కేవలం రెండు గంటల్లోనే ఒమిక్రాన్‌ను గుర్తించే టెస్ట్‌ కిట్‌ను భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ల్యాబ్‌లలోనే అందుబాటులో ఉండే ఈ కిట్‌ల ద్వారా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను అతితక్కువ సమయంలోనే గుర్తించవచ్చని ఐసీఎంఆర్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఒమిక్రాన్ బాధితులను త్వరగా గుర్తించి చికిత్స అందించేందుకు వీలవుతుందని ఐసీఎంఆర్ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోన్న వేళ.. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ అందులో పాజిటివ్‌గా తేలితే వెంటనే ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు. ఇలా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిర్ధారించుకోవడానికి మూడు, నాలుగు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ను వేగంగా గుర్తించే సరికొత్త కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ను అస్సాంలోని ఐసీఎంఆర్‌ రీజినల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ICMR-RMRC) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డాక్టర్‌ బిశ్వజ్యోతి బోర్కకోటి ఆధ్వర్యంలో నిపుణుల బృందం రూపొందించిన ఈ కిట్‌ను వెయ్యి మంది కొవిడ్‌ బాధితుల నమూనాలపై పరీక్షించారు. వీటిలో కచ్చితమైన ఫలితాలను వస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వీటి లైసెన్సు జారీ ప్రక్రియ కొనసాగుతోందని.. వచ్చే వారంలోనే ఈ కిట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇదే సమయంలో ఈ కిట్‌లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కోల్‌కతాకు చెందిన జీసీసీ బయోటెక్‌తో ఐసీఎంఆర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఇవి యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్‌ల మాదిరిగా ఎక్కడైనా ఉపయోగించే పరిస్థితి లేదు. కేవలం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేసే కేంద్రాల్లోనే ఈ టెస్టు కిట్‌లు అందుబాటులోకి రానున్నాయి.

ఇదిలాఉంటే, దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 38కి చేరింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వీటిని త్వరగా నిర్ధారించే పరీక్షల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Read Also.. Omicron: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. పెరగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. ఇప్పటివరకు ఎన్నంటే?

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ