AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19 Omicron: నాగ్‌పూర్‌లో తొలి ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసు.. దేశవ్యాప్తంగా 37కు చేరిన సంఖ్య!

Omicron cases in India: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం రేపుతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒకే రోజు దేశంలో నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Covid 19 Omicron: నాగ్‌పూర్‌లో తొలి ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసు.. దేశవ్యాప్తంగా 37కు చేరిన సంఖ్య!
Omicron
Balaraju Goud
|

Updated on: Dec 12, 2021 | 6:37 PM

Share

Omicron cases in India: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం రేపుతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒకే రోజు దేశంలో నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చండీగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో కేసులు నమోదవగా.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ కేసు వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఆఫ్ కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో కలిపి దేశంలో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల 37కు చేరుకోగా.. మహారాష్ట్రలో 18కు చేరింది. పశ్చిమ ఆఫ్రికా నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుడి నమూనాలను సేకరించి.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలినట్లు నాగ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎంసీ) కమిషనర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. నాగ్‌పూర్‌లో ఇదే మొదటి కేసు. ఒమిక్రాన్‌ వైరస్ సోకిన వ్యక్తి దక్షిణాఫ్రికా నుండి ఢిల్లీ మీదుగా నాగ్‌పూర్‌కు చేరుకున్నట్లు అధికారి తెలిపారు. సోకిన వ్యక్తిని విమానాశ్రయంలో పరీక్షించగా, అతనికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆయన చెప్పారు.

స్థానిక నివాసి అయిన వ్యక్తి ఎనిమిది రోజుల క్రితం పశ్చిమ ఆఫ్రికాలోని ఓ దేశం నుంచి వచ్చాడని, ఆ తర్వాత అతనికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఆ తర్వాత సిటీ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యాడని, అతని శాంపిల్స్‌ సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఇవాళ రిపోర్టుల్లో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని వివరించారు. అతని కాంటాక్టులను గుర్తించి, పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలినట్లు చెప్పారు. సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. అతని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాధి సోకిన వ్యక్తిని డిసెంబర్ 6న మాత్రమే పరీక్షించారు. ఆ తర్వాత ఒక నమూనా NIVకి పంపబడింది. ఈ రోజు NIV నుండి నివేదిక వచ్చింది. దీనిలో వ్యక్తి Omicron వైరస్ బారిన పడ్డాడని నిర్ధారించరు. రోగితో పరిచయం ఉన్న వ్యక్తులకు వ్యాధి సోకలేదని అధికారులు తెలిపారు. రోగి పరిస్థితి నిలకడగా ఉందని, అతనిపై నిఘా ఉంచామని చెప్పారు.

మహారాష్ట్రలో కొత్త కేసుల రావడంతో, ఒమిక్రాన్ సోకిన మొత్తం కేసుల సంఖ్య 18కి పెరిగింది. ఈ 18 మందిలో 7 మందిని శుక్రవారం కోలుకుని ఇంటికి పంపించారు. ఏడుగురి డిశ్చార్జ్ తరువాత, ఒమిక్రాన్ సోకిన రోగుల సంఖ్య ఇప్పుడు మహారాష్ట్రలో 11కి తగ్గింది. విశేషమేమిటంటే, ఒమిక్రాన్‌ సోకిన రోగి తెరపైకి వచ్చిన మహారాష్ట్రలోని ఐదవ ప్రాంతం నాగ్‌పూర్. ఇంతకుముందు, ముంబై, పింప్రి చించ్వాడ్, పూణే, కళ్యాణ్-డోంబివిలీలలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అధికారుల లెక్కల ప్రకారం, ఇప్పటివరకు ముంబైలో 5, పింప్రి చించ్వాడ్‌లో 10, పూణేలో 1 మరియు కళ్యాణ్-డోంబివిలీలో 1 కేసులు నమోదయ్యాయి. Read Also… India help to Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు చేరిన భారత్ మెడిసిన్స్.. తాలిబన్ల ధన్యవాదాలు.. ఈ సహాయంపై వారెమన్నారంటే..