AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Rules: కొత్త వేరియంట్‌ ముప్పుతో సర్కార్ అప్రమత్తం.. మాస్క్ నిర్లక్ష్యం ఖరీదు 31 కోట్లు..!

మాస్క్ ధరించని నిర్లక్ష్యం ఖరీదు 31 కోట్లు...యస్ మీరు వింటున్నది నిజం.. ఏడాది వ్యవధిలో మాస్క్ దరించని వారికి ప్రభుత్వం విధించిన జరిమానా ఇది..

Covid Rules: కొత్త వేరియంట్‌ ముప్పుతో సర్కార్ అప్రమత్తం.. మాస్క్ నిర్లక్ష్యం ఖరీదు 31 కోట్లు..!
Covid 189 Mask
Balaraju Goud
|

Updated on: Dec 12, 2021 | 5:08 PM

Share

Covid Rules must: మాస్క్ ధరించని నిర్లక్ష్యం ఖరీదు 31 కోట్లు…యస్ మీరు వింటున్నది నిజం.. ఏడాది వ్యవధిలో మాస్క్ దరించని వారికి ప్రభుత్వం విధించిన జరిమానా ఇది.. పది రూపాయల మాస్క్ తో ముక్కు – మూతి మూసు కోవడానికి నిర్లక్ష్యం వహించిన వారు వెయ్యి రూపాయల చొప్పున చేతి చమురు వదిలించుకున్నారు.మళ్లి తర్డ్ వేవ్ తప్పదని.. కొత్త వేరియంట్ రూపంలో ఒమిక్రాన్ ముప్పు ముంచు కొస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాస్క్ రూల్ మాస్ట్‌గా మారింది.. మరోసారి జరిమానాలు చర్చనీయాంశంగా మారాయి..

కొవిడ్‌ మహమ్మారి మూడో ముప్పు, దానికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న తరుణంలో కట్టడి చర్యలకు మరోసారి ప్రభుత్వం ఉపక్రమించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలనే నిబంధనను విధించింది. మాస్క్‌ లేకుండా విచ్ఛలవిడిగా తిరిగే వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసు సిబ్బంది ప్రతిరోజూ తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్క్‌ ధరించి రావాలని సూచిస్తున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్క్‌ ధరించకుండా రోడ్లపైకి వస్తున్న వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. వాహనదారులు, ప్రజలకు మాస్క్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

2020 సంవత్సరంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా మొదటి దఫా కరోనావ్యాప్తి మొదలైంది.. కరోనా నుండి స్వీయ రక్షణ పొందాలంటే మాస్క్ తప్పనిసరని వైద్యులు హెచ్చరించారు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే సూచించింది. మొదటిదశ కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో చాలామంది మాస్కులు తీసేశారు.. దాని పర్యావసానమే రెండవదశలో ఊహించని ప్రాణనష్టం… వందలాది మంది పిట్టల్లా రాలి పోయారు..అందులో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు.. ఈ నేపథ్యంలో మాస్క్ రూల్ మరింత కఠినంగా అమలులోకి వచ్చింది.. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్-2005 ప్రకారం మాస్క్ దరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు.. ఒక్క వరంగల్ జిల్లాలోనే ఇలా ఏడాది వ్యవదిలో మాస్క్ నిబంధనలు ఉల్లంఘించిన 3,26,858 మందికి జరిమానాలు విధించారు.. వీరంతా 31 కోట్ల రూపాయలు జరిమానా రూపంలో చెల్లించారని పోలీస్ క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి..

మరోవైపు, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మరింత నిర్లక్ష్యం పెరిగింది.. చాలామంది మాస్క్ లు తీసేశారు.. కనీసం గుంపులుగా ఉన్న చోట, రాజకీయ సమావేశాలు, శుభకార్యాలు, పబ్లిక్ ప్లేస్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో కూడా మాస్క్ దరించడం లేదు. పది రూపాయలు పెట్టి మూతికి మాస్క్ పెట్టుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తున్న వారు వెయ్యి రూపాయల జరిమానా చెల్లించి జేబులు కాళీ చేసుకుంటున్నారు.. మళ్ళీ థర్డ్ వేవ్ తప్పదని.. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు ముంచుకొస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వరంగల్ లో పోలీసులు మాస్క్ రూల్స్ మస్ట్ చేశారు.. ఎవరికి వారు మాస్క్ ధరించి స్వీయ రక్షణ పొందాలని సూచిస్తున్న పోలీసులు మాస్క్ దరించని వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ చిన్న నిర్లక్ష్యం ఖరీదు ఎంతటి బారీ మూల్యంగా మారిందో చూశారు కదా… మాస్క్ నిర్లక్ష్యం ఖరీదు పెరిగి పెద్దదై కోట్ల రూపాయల జరిమానాగా మారగా… ఇదే నిర్లక్ష్యం కొందరి ప్రాణాలు మింగేసింది… ఇక థర్డ్ వేవ్ ముందుంది.. సో బీ కేర్ ఫుల్…

Read Also… Waitress Gets Rs 7 Lakh Tip: వెయిటర్‌ పంట పండింది.. ఫుడ్‌ సర్వ్‌ చేసి ఏకంగా 7 లక్షల టిప్‌ అందుకుంది..