Horoscope Today: నేడు ఈ రాశిలో వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు.. ఈరోజు రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (December-13-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా రోజు మొదలయ్యే ముందు.. తమకు ఈరోజు ఎలా జరుగుతుంది. మంచి చెడులు..

Horoscope Today: నేడు ఈ రాశిలో వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు.. ఈరోజు రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Dec 13, 2021 | 7:27 AM

Horoscope Today (December-13-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా రోజు మొదలయ్యే ముందు.. తమకు ఈరోజు ఎలా జరుగుతుంది. మంచి చెడులు ఏమిటి..? చేపట్టిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయా.. ఆటంకాలు ఏర్పడుతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 13వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి పనుల్లో ఉన్నవారు రాణిస్తారు. ఇబ్బందులను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. కొత్తపనులను వాయిదా వేసుకోవడం మంచిది.  ఇతరులకు ఇబ్బందిని కలిగించే పనులను మానుకోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కొత్త పనులను చేపడతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. బంధు మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను అందుకుంటారు. కుటంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి సంతృప్తీ కరంగా సాగుతుంది.  కొత్తపనులను ఉత్సాహంగా చేపడతారు.  పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.  బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు అధికంగా శ్రమపడతారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోయి మానసికంగా ఇబ్బంది పడతారు. ఆర్ధిక  ఇబ్బందులు ఎదుర్కొంటారు.  ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను పరిపూర్ణంగా పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. శుభవార్త వింటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు కొందరి వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు చేపడతారు.  అన్నదమ్ములతో వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేక మానసిక ఆందోళనకు గురవుతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు వృధా ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. కొత్త పనులను చేపడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురవుతారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివావారికీ మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నిందలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది. మానసిక ఆందోళలన కలిగి ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. విందు వినోద కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు శుభవార్త వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కష్టానికి ఫలితం అందుకుంటారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Also Read:   గ్రాముకి ఒక రూపాయి తగ్గిన పసిడి ధర, స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు..