AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 2 రాశులవారి ప్రేమ జీవితంలో 3 కారణాల వల్ల గొడవలు తలెత్తుతాయి.. ఏయే రాశులంటే!

జోతిష్యశాస్త్రం, రాశిచక్రాలపై చాలామందికి నమ్మకం ఉండదు. కానీ కొందరు మాత్రం వీటిని విశ్వసిస్తారు. నక్షత్రాలు, రాశులు సరిగ్గా కలిసిన...

Zodiac Signs: ఈ 2 రాశులవారి ప్రేమ జీవితంలో 3 కారణాల వల్ల గొడవలు తలెత్తుతాయి.. ఏయే రాశులంటే!
Zodiac Signs
Ravi Kiran
|

Updated on: Dec 13, 2021 | 10:10 PM

Share

జోతిష్యశాస్త్రం, రాశిచక్రాలపై చాలామందికి నమ్మకం ఉండదు. కానీ కొందరు మాత్రం వీటిని విశ్వసిస్తారు. నక్షత్రాలు, రాశులు సరిగ్గా కలిసిన వారి మధ్య బంధం గొప్పగా ఉంటుంది. వారి మధ్య వచ్చే ఇబ్బందులు కలిసి ఎదుర్కోగలరని గట్టిగా నమ్ముతారు. సింహం రాశి, వృషభరాశి వారు పరస్పరం కలవడానికి, వారి మధ్య ప్రేమ అనే ఫీలింగ్ చిగురించడానికి కూడా ఇదే కారణమట. వీరు ప్రేమలో ఉన్నప్పుడు గొప్ప కెమిస్ట్రీ ఉంటుందట. తమ జీవిత భాగస్వాములను సంతోషంగా చూడాలని ఎప్పుడూ కోరుకుంటారట. కానీ ఈ 3 కారణాలు వల్ల వీరి మధ్య వివాదాలు తలెత్తుతాయి.

పొసెసివ్‌నెస్, భౌతికవాదం…

వృషభరాశి వారి పొసెసివ్‌నెస్, భౌతికవాదం అప్పుడప్పుడూ సింహరాశి వారికి చికాకు పుట్టిస్తుంది. వృషభరాశి వ్యక్తులు ఎప్పుడూ స్వార్ధంతో ఉంటారు. ప్రతీ విషయాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. తమ భాగస్వామి విషయంలోనూ ఇదే తీరును కొనసాగిస్తారు. అయితే సింహరాశి వారు ఎప్పుడూ స్నేహభావంతోనే ఉంటారు. దీనితో వీరికి వృషభరాశి వారి పొసెసివ్‌నెస్ కొన్నిసార్లు చికాకు తెప్పిస్తుంది.

శ్రద్ధ చూపరు…

స్నేహితులు, సహోద్యోగులు లేదా జీవత భాగస్వామి.. ఇలా ఎవరైనా కూడా తమపై శ్రద్ధ చూపించాలని సింహరాశి వారు కోరుకుంటారు. ఎదుటవారు తమను ఇష్టపడటం, ప్రశంసించడం సింహరాశి వారిని ఆనందపరుస్తాయి. కాబట్టి సహజంగానే, ప్రేమలో ఉన్నప్పుడు ఈ రాశివారు అటెన్షన్‌ను కోరుకుంటారు. కానీ వృషభరాశి మాత్రం శ్రద్ధ చూపించడం తక్కువే. ఇదే వీరి మధ్య గొడవకు కారణమవుతుంది.

అసూయ..

చిన్నపాటి గొడవలు, కలహాలు ఈ జంట మధ్య బంధాన్ని విచ్చిన్నం చేయనప్పటికీ.. అసూయ వీరి మధ్య ఇబ్బందులు సృష్టిస్తుంది. సింహరాశి వారు ఎక్కువగా స్నేహితులతో గడుపుతారు. తమ భాగస్వాములకు టైం ఇవ్వడం కష్టమే. అటు వృషభరాశివారికి పొసెసివ్‌నెస్ ఎక్కువ. వీరికి సమయం వెచ్చించకపోతే అసూయపడతారు. వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. తద్వారా వీరి మధ్య ఇబ్బందులు తలెత్తుతాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.