Petrol Diesel Price: అంతర్జాతీయంగా పెరుగుతోన్న ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు ఇప్పట్లో తగ్గవా..
ఒమిక్రాన్ భయం తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థల్లో రికవరీ ఆశలు మరోసారి బలపడటం ప్రారంభించాయి. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పైకి ఎగబాకాయి...
ఒమిక్రాన్ భయం తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థల్లో రికవరీ ఆశలు మరోసారి బలపడటం ప్రారంభించాయి. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పైకి ఎగబాకాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.24 శాతం పెరిగి 76.08 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.40 శాతం పెరిగి 72.65 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ముడిచముర ధరలు పెరుగుతుండడంతో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.
డిసెంబర్ 13, సోమవారం, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.97 కాగా, డీజిల్ ధర రూ.86.67గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ ధర రూ.94.14గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40, లీటర్ డీజిల్ ధర రూ.91.43గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు పెట్రోల్ లీటరుకు రూ.104.67, డీజిల్ లీటరుకు రూ.89.79 చొప్పున విక్రయిస్తున్నారు. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 109.14గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.47గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.31గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.73గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.38 ఉండగా.. డీజిల్ ధర రూ.94.79గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.36కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.45లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.95 ఉండగా.. డీజిల్ ధర రూ. 96.01గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.46లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.57గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.91గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.03గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.36 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.45లకు లభిస్తోంది.