Stock Market: ఈ వారం మార్కెట్‎పై ద్రవ్యోల్బణం డేటా, వడ్డీ రేట్లు ప్రభావం చూపుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

ఈ వారం స్టాక్ మార్కెట్లపై ద్రవ్యోల్బణం డేటా, వడ్డీ రేట్లపై US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు....

Stock Market: ఈ వారం మార్కెట్‎పై ద్రవ్యోల్బణం డేటా, వడ్డీ రేట్లు ప్రభావం చూపుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 13, 2021 | 7:11 AM

ఈ వారం స్టాక్ మార్కెట్లపై ద్రవ్యోల్బణం డేటా, వడ్డీ రేట్లపై US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వారంలో గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల పాలసీ నిర్ణయాలను మార్కెట్ పర్యవేక్షిస్తుందని. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఫెడరల్ రిజర్వ్ నిర్ణయమని. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌ల ద్రవ్య సమీక్ష కూడా ఈ వారంలో జరగనుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. మార్కెట్‌పై ఓమిక్రాన్ ప్రభావం ఇకపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కానీ Omicron కి సంబంధించిన వార్తల కారణంగా మార్కెట్లో కొంత అస్థిరత ఉండవచ్చని వివరించారు. గత వారం, 30 షేర్ల BSE సెన్సెక్స్ 924.31 పాయింట్లు అంటే 1.60 శాతం పెరిగింది.

“దేశీయ రంగంలో ద్రవ్యోల్బణం గణాంకాలు, FOMC సమావేశం ఫలితాలు ఈ వారం మార్కెట్-ఆధారిత పరిణామాలుగా ఉంటాయి.” అని సామ్‌కో సెక్యూరిటీస్‌కు చెందిన ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యేషా షా చెప్పారు. కోటక్ సెక్యూరిటీస్‌లో ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ మాట్లాడుతూ, “యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశాన్ని మార్కెట్ వెంటనే చూస్తుంది. ఇది కాకుండా, బ్రెంట్ క్రూడాయిల్ ధర, రూపాయి అస్థిరత, విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడుల ధోరణి కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది.

సెన్సెక్స్‌లోని టాప్ 10 కంపెనీల్లో 7 మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) గత వారం రూ.2,28,367.09 కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడింది. ఇది కాకుండా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మార్కెట్ విలువ కూడా పెరిగింది.గత వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,35,204.46 కోట్లు పెరిగి రూ.16,62,776.63 కోట్లకు చేరుకోగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ.5,125.39 కోట్లు పెరిగి రూ.8,43,528.19 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.9,988.16 కోట్లు పెరిగి రూ.7,39,607.12 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ స్థానం రూ.28,817.13 కోట్లు పెరిగి రూ.5,26,170.49 కోట్లకు చేరుకుంది.

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) డిసెంబరులో ఇప్పటివరకు భారతీయ మార్కెట్ల నుంచి రూ.8,879 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం డిసెంబర్ 1 నుండి 10 వరకు, ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ.7,462 కోట్లు, డెట్ లేదా బాండ్ మార్కెట్‌ల నుండి రూ.1,272 కోట్లు, హైబ్రిడ్ ఉత్పత్తుల నుండి రూ.145 కోట్లు ఉపసంహరించుకున్నాయి. ఈ విధంగా వారి నికర ఉపసంహరణ రూ. 8,879 కోట్లుగా నమోదయింది. నవంబర్‌లో ఎఫ్‌పీఐలు భారత మార్కెట్ల నుంచి రూ.2,521 కోట్లను ఉపసంహరించుకున్నాయి.

Read Also.. Franklin Templeton MF: వారికి శుభవార్త.. రూ. 985 కోట్ల 8వ వాయిదా చెల్లించనున్న SBI MF..