Franklin Templeton MF: వారికి శుభవార్త.. రూ. 985 కోట్ల 8వ వాయిదా చెల్లించనున్న SBI MF..

SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (SBI MF) సోమవారం నుండి మూసివేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ MF ఆరు స్కీమ్‌ల యూనిట్ హోల్డర్‌లకు రూ. 985 కోట్ల 8వ వాయిదా చెల్లింపును ప్రారంభించనుంది...

Franklin Templeton MF: వారికి శుభవార్త.. రూ. 985 కోట్ల 8వ వాయిదా చెల్లించనున్న SBI MF..
Money
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 13, 2021 | 6:45 AM

SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (SBI MF) సోమవారం నుండి మూసివేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ MF ఆరు స్కీమ్‌ల యూనిట్ హోల్డర్‌లకు రూ. 985 కోట్ల 8వ వాయిదా చెల్లింపును ప్రారంభించనుంది. ఈ వాయిదా తర్వాత చెల్లించిన మొత్తం రూ.26,098.2 కోట్లు అవుతుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ ప్రతినిధి ఆదివారం తెలిపారు. ఈ మొత్తం ఏప్రిల్ 23, 2020 నాటికి అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM)లో 103.5 శాతం. ఈ పథకాలను మూసివేసిన తర్వాత మొత్తం రూ.25,114 కోట్లు పంపిణీ చేసినట్లు అధికార ప్రతినిధి తెలిపారు. ఫిబ్రవరిలో తొలి విడతగా రూ.9,122 కోట్లు పెట్టుబడిదారులకు అందించారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో 2,962 కోట్లు, మేలో 2,489 కోట్లు, జూన్‌లో 3,205 కోట్లు, జూలైలో 3,303 కోట్లు, సెప్టెంబర్‌లో 2,918 కోట్లు, నవంబర్‌లో రూ.1,115 కోట్లు ఇచ్చారు.

ఎలక్ట్రానిక్ పద్ధతిలో డబ్బు బదిలీ ఈ చెల్లింపు యూనిట్ హోల్డర్‌లకు NAVలో వారి యూనిట్‌లకు అనుగుణంగా ఇస్తారు. ఈ చెల్లింపు అర్హత ఉన్న యూనిట్ హోల్డర్లందరికీ SBI MF ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లిస్తారు. ఈ పథకాలకు లిక్విడేటర్‌గా ఎస్‌బీఐ ఎంఎఫ్‌ని సుప్రీంకోర్టు నియమించింది. యూనిట్‌హోల్డర్ బ్యాంక్ ఖాతా ఎలక్ట్రానిక్ చెల్లింపుకు అర్హత లేకపోతే, చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ జారీ చేస్తారు. SBI MF ద్వారా వారి నమోదిత చిరునామాకు పంపిస్తారు.

కొత్త రుణ పథకంపై రెండేళ్లపాటు నిషేధం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఇండియా) రెండేళ్లపాటు ఎలాంటి కొత్త రుణ పథకాన్ని ప్రవేశపెట్టకుండా సెబీ నిషేధించింది. వాస్తవానికి, 23 ఏప్రిల్ 2020న, దాదాపు రూ. 26,000 కోట్ల ఆస్తులు కలిగిన 6 రుణ పథకాలను కంపెనీ మూసివేసింది. అయితే నిబంధనలకు విరుద్ధమైన డెట్ స్కీమ్‌లో కంపెనీ పక్షాన తీవ్రమైన లోపం జరిగిందని సెబీ అభిప్రాయపడింది. కాబట్టి, 2020లో తీసుకున్న మేనేజ్‌మెంట్, అడ్వైజరీ ఫీజులను 12% వడ్డీతో రీఫండ్ చేయాల్సిందిగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అసెట్ మేనేజ్‌మెంట్ ఆదేశించింది. దీని మొత్తం విలువ రూ. 512 కోట్లు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏప్రిల్‌లో మూసివేసిన పథకాలలో అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, ఇండియా లోన్ డ్యూరేషన్ ఫండ్, ఇండియా డైనమిక్ అక్రూవల్ ఫండ్, ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్, ఇండియా షార్ట్ టర్మ్ ఇన్‌కమ్ ప్లాన్ ఉన్నాయి.

మార్చిలో SBI MF ద్వారా ఆస్తులను మానిటైజేషన్ చేయడానికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ యొక్క ఆరు డెట్ స్కీమ్‌ల యూనిట్‌హోల్డర్‌లకు ఆదాయాన్ని పంపిణీ చేయడానికి ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని సుప్రీంకోర్టు ఆమోదించింది.

Read Also.. Gold ETF: నవంబర్ నెలలో రెండింతలు పెరిగిన గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి.. ఇందులో పెట్టుబడి పెట్టడం ఎలా? తెలుసుకోండి!