Gold ETF: నవంబర్ నెలలో రెండింతలు పెరిగిన గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి.. ఇందులో పెట్టుబడి పెట్టడం ఎలా? తెలుసుకోండి!
పెట్టుబడులు పెట్టడానికి గోల్డ్ ఇటిఎఫ్‌లు బెటర్ అని పెట్టుబడి దారులు భావిస్తున్నారు. దీంతో నవంబర్‌లో 683 కోట్ల రూపాయల గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడి వచ్చింది.
Gold ETF: పెట్టుబడులు పెట్టడానికి గోల్డ్ ఇటిఎఫ్‌లు బెటర్ అని పెట్టుబడి దారులు భావిస్తున్నారు. దీంతో నవంబర్‌లో 683 కోట్ల రూపాయల గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడి వచ్చింది. అక్టోబర్‌తో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. అక్టోబర్‌లో 304 రూపాయల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఒకవేళ మీరు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు గోల్డ్ ఇటిఎఫ్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
గోల్డ్ ఇటిఎఫ్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి?
ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. ఇది బంగారం ధరల హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. ఇది స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడంతోపాటు బంగారంపై పెట్టుబడి పెట్టే సౌలభ్యాన్ని ఇస్తుంది. గోల్డ్ ఇటిఎఫ్‌లను స్టాక్‌ల మాదిరిగానే బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో కొనుగోలు చేయవచ్చు. విక్రయించవచ్చు. అయితే, ఇందులో మీకు బంగారం రాదు. మీరు దాని నుంచి నిష్క్రమించాలనుకున్నప్పుడు, ఆ సమయంలో బంగారం ధరకు సమానమైన డబ్బు మీకు లభిస్తుంది.
దీనిపై ఎంత పన్ను చెల్లించాలి?
బంగారం మాదిరిగానే, డిజిటల్ బంగారం కొనుగోలు (పెట్టుబడి)పై 3% జేఎస్టీ(GST) చెల్లించాలి. అదే సమయంలో, దానిని విక్రయించే పన్ను కూడా భౌతిక బంగారంతో సమానంగా ఉంటుంది. మీరు బంగారాన్ని కొనుగోలు చేసిన 3 సంవత్సరాలలోపు విక్రయించినట్లయితే, అది స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఈ విక్రయం ద్వారా వచ్చే లాభం మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. ఇక, 3 సంవత్సరాల తర్వాత బంగారాన్ని విక్రయిస్తే, అది దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించబడుతుంది. దీనిపై 20.8% పన్ను చెల్లించాలి.
గోల్డ్ ఇటిఎఫ్‌లో ఎలా పెట్టుబడి పెట్టవచ్చు?
గోల్డ్ ఇటిఎఫ్‌లను కొనుగోలు చేయడానికి, మీరు మీ బ్రోకర్ ద్వారా డీమ్యాట్ ఖాతాను తెరవాలి. దీనిలో, మీరు ఎన్ఎస్ఈ(NSE)లో అందుబాటులో ఉన్న గోల్డ్ ఈటీఎఫ్(ETF) యూనిట్‌లను కొనుగోలు చేయవచ్చు. మీ డీమ్యాట్ ఖాతాకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి సమానమైన మొత్తం తీసివేస్తారు. మీ డిమ్యాట్ ఖాతాలో ఆర్డర్ చేసిన రెండు రోజుల తర్వాత గోల్డ్ ఇటిఎఫ్‌లు మీ ఖాతాలో జమ చేస్తారు. గోల్డ్ ఇటిఎఫ్‌లను ట్రేడింగ్ ఖాతా ద్వారానే విక్రయిస్తారు.
రాబోయే 1 సంవత్సరంలో బంగారం 55 వేలకు చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. అనేక దేశాలలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా, రాబోయే కాలంలో బంగారం మద్దతు ఉంటుంది. దీంతో వచ్చే ఏడాదిలో బంగారం మళ్లీ 55 వేలకు చేరే అవకాశం ఉంది. అందుకే మీరు ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఇప్పుడే పెట్టుబడి పెట్టవచ్చు నాయి నిపుణులు సూచిస్తున్నారు. అయితే, పెట్టుబడి పెట్టె ముందు మార్కెట్ పరిస్థితిని గమనించి.. నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకుని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.