IRCTC: రాజస్థాన్ అందాలను చూడాలని కోరుకుంటే మీ కోసం ఆరు రోజుల అద్భుత అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ.. వివరాలివిగో..
రాజస్థాన్ సందర్శించడానికి శీతాకాలం ఉత్తమ సమయం. అందుకోసమే ఈ సమయంలో చాలా మంది పర్యాటకులు రాజస్థాన్‌ను సందర్శించడానికి వెళతారు.
IRCTC Tour Package: రాజస్థాన్ సందర్శించడానికి శీతాకాలం ఉత్తమ సమయం. అందుకోసమే ఈ సమయంలో చాలా మంది పర్యాటకులు రాజస్థాన్‌ను సందర్శించడానికి వెళతారు. ఈ నేపధ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) మరో చౌక.. విలాసవంతమైన టూర్ ప్యాకేజీని అందించింది. ఈ టూర్ ప్యాకేజీలో, మీరు రాజస్థాన్, జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, పుష్కర్ వంటి అత్యంత అందమైన నగరాలను సందర్శించే అవకాశాన్ని పొందుతారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలోని రాజస్థాన్ రాజ భూమిని చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తోంది. దీని కింద మీరు రాజస్థాన్, రాజుల భూమి, వారి రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వం.. నిర్మాణ శైలిని అర్థం చేసుకోగలరు. ఐఆర్సీటీసీ(IRCTC) ప్రకారం, గొప్ప చరిత్ర, సాంప్రదాయ.. రంగుల కళతో, రాజస్థాన్ ఎప్పుడూ భారతీయ.. విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ పర్యటనలో మీరు ఎడారి నగరం జైసల్మేర్, సాంస్కృతిక నగరం జోధ్‌పూర్, లేక్ సిటీ ఉదయపూర్‌లను ఆస్వాదించగలరు.
ఐఆర్సీటీసీ రాజస్థాన్ టూర్ వివరాలివే.. (జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, పుష్కర్ (రాజస్థాన్) పర్యటన ప్యాకేజీ..)
ప్యాకేజీ పేరు – గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్థాన్: జోధ్‌పూర్-జైసల్మేర్-పుష్కర్-జైపూర్
కవర్ అయ్యే ప్రదేశాలు – జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, పుష్కర్
ట్రావెలింగ్ మోడ్ – ఫ్లైట్
విమాన వివరాలు – ఇండిగో
విమానం నంబర్ (6E 266) 10.02.2022న ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 09.00 గంటలకు జోధ్‌పూర్ చేరుకుంటుంది. తిరిగి విమానం నంబర్ (6E 471) జైపూర్‌లో 15.02.2022న 17:40కి బయలుదేరి 19:40కి హైదరాబాద్ చేరుకుంటుంది.
IRCTC సమాచారాన్ని ట్వీట్ చేసింది
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేయడం ద్వారా రాజస్థాన్ ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని అందించింది. దీనితో పాటు, పూర్తి టూర్ సర్క్యూట్, ధర.. ఈ పర్యటన ఎన్ని రోజులు ఉంటుంది అనే సమాచారం కూడా ఇచ్చారు. మీరు కూడా ఈ శీతాకాలంలో రాజస్థాన్‌ను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్ ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సందర్శించి మీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు లేదా ట్వీట్‌లో ఇచ్చిన ఈ లింక్ ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు ప్రత్యక్ష సమాచారం పొందవచ్చు. అదే విధంగా ఈ టూర్ కి సంబంధించిన ఏదైనా సమాచారం కోసం, మీరు ఈ ఫోన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు- 8287932228, 8287932229, 8287932230.
Spend 6 days & 5 nights in the royal state of #Rajasthan & rediscover its undeniable charm. Book our ‘Golden Sands of Rajasthan’ air tour package starting at Rs. 29,050/-pp*. Details on https://t.co/k5AhwRNKVL *T&C Apply
— IRCTC (@IRCTCofficial) December 9, 2021
పర్యటన ఎన్ని రోజులు?
జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్ మరియు పుష్కర్ (రాజస్థాన్) ఈ పూర్తి పర్యటన 5 రాత్రులు- 6 పగళ్లు. ప్రయాణీకులు 10.02.2022న ఇండిగో విమానం ద్వారా జోధ్‌పూర్ చేరుకుని పర్యటనను ప్రారంభిస్తారు. కాగా, 15.02.2022న జైపూర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
టూర్ ప్యాకేజీ ధర?
ఈ టూర్ ప్యాకేజీ ఖర్చుతో, వ్యక్తి ప్రకారం, సింగిల్ షేరింగ్‌కు రూ.38950, డబుల్ షేరింగ్‌కు రూ.29950, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.29050 ఖర్చవుతుంది. మరోవైపు, బెడ్ అవసరం అయ్యే పిల్లలకు (2 నుండి 11 సంవత్సరాల మధ్య) రూ. 24000.. బెడ్ అవసరం లేని పిల్లలకు (2 నుండి 4 సంవత్సరాల మధ్య) మీకు రూ.17650 ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోండి
ఈ ప్యాకేజీని బుక్ చేసుకునే పర్యాటకులు తప్పనిసరిగా రెండు డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదే సమయంలో, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పర్యాటకులు.. 2 డోస్ టీకాలు వేయని వారు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం RT-PCR ప్రతికూల పరీక్ష ధృవీకరణ పత్రాన్ని చూపించవలసి ఉంటుంది.