Post Office Saving Schemes: మీ డబ్బు రెట్టింపు కావాలంటే ఇందులో పెట్టుబడి పెట్టండి.. రూ.1000 మొదలు పెట్టొచ్చు..
ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం పొందాలంటే.. పోస్టాఫీస్ పథకాలు మంచి ఎంపిక అవుతాయి. ఈ పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర (కెవిపి ఒకటి...
ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం పొందాలంటే.. పోస్టాఫీస్ పథకాలు మంచి ఎంపిక అవుతాయి. ఈ పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర (కెవిపి ఒకటి. మీరు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు పోస్టాఫీసులోని పథకంలో పొదుపు చేయవచ్చు. ఈ పథకాలలో మీరు బ్యాంకు కంటే మెరుగైన రాబడిని పొందుతారు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా పూర్తిగా సురక్షితం. బ్యాంకు దివాలా తీసినట్లయితే మీరు కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన మొత్తం డబ్బుపై ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు 124 నెలల్లో (10 సంవత్సరాల 4 నెలలు) రెట్టింపు అవుతుంది. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.
వడ్డీ రేటు
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రలో 6.9 శాతం వడ్డీ రేటు ఉంది. ఇందులో వడ్డీని ఏటా కలుపుతారు. ఈ వడ్డీ రేటు 1 ఏప్రిల్ 2020 నుంచి వర్తిస్తుంది.
పెట్టుబడి మొత్తం
ఈ పోస్టాఫీసు పథకంలో కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. రూ.100 గుణిజాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు.
ఎవరు ఖాతా తెరవగలరు?
కిసాన్ వికాస్ పత్రలో ఒక వయోజనుడు లేదా ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను తెరవగలరు. ఈ పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ తన పేరు మీద కూడా ఖాతాను తెరవవచ్చు.
మెచ్యూరిటీ
ఈ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు నోటిఫై చేసిన మెచ్యూరిటీ వ్యవధి ఆధారంగా మెచ్యూర్ అవుతుంది.
ఖాతాకు బదిలీ
కిసాన్ వికాస్ పత్ర కింది సందర్భాలలో మాత్రమే వ్యక్తి నుంచి వ్యక్తికి ఖాతా బదిలీ చేస్తారు: ఖాతాదారు మరణించిన తర్వాత, అది అతని నామినీకి లేదా చట్టపరమైన వారసుడికి బదిలీ చేస్తారు. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో ఖాతాను జాయింట్ హోల్డర్‌కు బదిలీ చేయవచ్చు. కోర్టు ఆదేశాల మేరకు ఖాతా బదిలీ చేయవచ్చు.
Read also.. Petrol Diesel Price: అంతర్జాతీయంగా పెరుగుతోన్న ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు ఇప్పట్లో తగ్గవా..