AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం వడ్డీ ద్వారానే రూ.5 లక్షలు.. ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే మీ పంట పండినట్లే..

కేవలం వడ్డీ ద్వారానే ఈ పథకంలో రూ.5 లక్షలు సంపాదించవచ్చు. కేవలం వెయ్యి నుంచి ఎంతైనా సరే ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు. మీ సమీపంలోని ఏదైనా పోస్టాఫీస్‌కు వెళ్లి ఆధార్, బ్యాంక్ వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం.

కేవలం వడ్డీ ద్వారానే రూ.5 లక్షలు.. ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే మీ పంట పండినట్లే..
Nsc Post Office Scheme
Venkatrao Lella
|

Updated on: Nov 17, 2026 | 4:39 PM

Share

సాంప్రదాయ పోస్టాఫీస్ పథకాల్లోకి ఇటీవల పెట్టుబడులు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం ధరల్లో మార్పుల వల్ల రిస్క్ లేని ఆదాయం వైపు చాలామంది చూస్తున్నారు. సురక్షిత పెట్టుబడులను కోరుకునేవారికి మంచి మార్గాన్ని చూపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టాఫీస్ స్కీమ్‌లు. సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి సులువుగా తెరిచే అవకాశం ఉండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా పొదుపు పథకాల్లో చేరుతున్నారు. దీంతో ఇటీవల పోస్టల్ స్కీమ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. పోస్టాఫీసుల్లో బాగా పాపులర్ అయిన పథకం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC).

NSC పొదుపు ఖాతా ఎందుకు తెరవాలి..?

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే.. ఇందులో అధిక వడ్డీ పొందవచ్చు. దీంతో వడ్డీ రూపంలో మీరు జమ చేసే సొమ్ముపై ఎక్కువ ఆదాయం లభిస్తుంది. తమ డబ్బులకు ఎక్కువ వడ్డీని ఇచ్చే పథకాల కోసం చూసేవారికి ఇది గొప్ప అవకాశం. వడ్డీతో పాటు మీకు చక్రవడ్డీ కూడా ఇందులో లభిస్తోంది. దీని వల్ల మీ పెట్టుబడి రెట్టింపవుతుంది. చిన్న మొత్తంలో కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.

వడ్డీ ఎంత ఉందంటే..?

ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంది. అయితే చక్రవడ్డీ వల్ల మీకు అదనంగా బెనిఫిట్ ఉంటుంది. కేవలం రూ.వెయ్యి నుంచి గరిష్టంగా ఎంత సొమ్ము అయినా దాచుకోవచ్చు. మీరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ దానిపై ఆదాయం మరింత ఎక్కువగా లభిస్తుంది. మీ సమీపంలోని ఏదైనా పోస్టాఫీస్‌కు వెళ్లి ఆధార్, బ్యాంక్ వివరాలు అందించి ఇందులో చేరవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఈ ఖాతా తెరిచే అవకాశముంది. ఈ పథకానికి ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత వడ్డీతో సహా మొత్తం తీసుకోవచ్చు. అలాగే విత్ డ్రా చేసుకునేటప్పుడు ఎలాంటి టీడీఎస్ పడదు. ఐదేళ్లలోపు మీరు ఈ ఖాతాపై లోన్ కూడా తీసుకోవచ్చు. ఇలా అనేక బెనిఫిట్స్ పొందవచ్చు.

రూ.5 లక్షలు సంపాదించడం ఎలా..?

ఉదాహరణకు మీరు ఈ ఖాతాలో ఒకేసారి రూ.11.50 లక్షలు చేయాలి. 5 ఏళ్లకు మీకు వడ్డీ, చక్రవడ్డీ రూపంలో రూ.5,16,389 అదనంగా లభిస్తాయి. దీంతో ఒకేసారి రూ.16.66 లక్షలు ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే పిల్లల పేరుపై కూడా ఈ ఖాతా తెరవొచ్చు. పదేళ్ల వయస్సుకంటే తక్కువ ఉన్న పిల్లల ఖాతాను తల్లిదండ్రులు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఇందులోని పెట్టుబడులకు ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.80 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.

Follow Us