పాడి జంతువులలో ఈ లక్షణాలు కనిపిస్తే చాలా ప్రమాదం.. ఆ వ్యాధి కావొచ్చు జాగ్రత్త..

Dairy Farming:డిసెంబర్ మొదటి వారం వచ్చేసరికి చలి తీవ్రత పెరిగింది. మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటామో అలాగే పశువుల గురించి

పాడి జంతువులలో ఈ లక్షణాలు కనిపిస్తే చాలా ప్రమాదం.. ఆ వ్యాధి కావొచ్చు జాగ్రత్త..
Animal
Follow us
uppula Raju

|

Updated on: Dec 13, 2021 | 12:49 PM

Dairy Farming:డిసెంబర్ మొదటి వారం వచ్చేసరికి చలి తీవ్రత పెరిగింది. మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటామో అలాగే పశువుల గురించి కూడా ఆలోచించాలి. చలికాలంలో ముఖ్యంగా పాడి జంతువులు అనారోగ్యానికి గురై రోగాల భారిన పడుతాయి. కొన్ని జంతువులు చలిని తట్టుకోలేక మృతి చెందుతాయి. అందుకే జంతువులను ఎలా కాపాడుకోవాలో వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో జంతువుల ఆవాసాలను గాలి చొరబడకుండా నిర్మించాలి. జంతువులను పగటిపూట బహిరంగ సూర్యకాంతిలో వదిలివేయాలి. ఇది వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పశువుల కొట్టంలో పొడి మేత అందించాలి.

నులిపురుగుల నిర్మూలన చలి కాలంలో జంతువులకు ముక్కు కారటం, ఆకలి మందగించడం, వణుకు ఏర్పడుతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే జంతువులను సాయంత్రం వేళలో దొడ్డిలో కట్టి, సరైన ఆశ్రయం కల్పించాలి. గర్భిణీ ఆవులు, గేదెలను సరిగ్గా చూసుకోవాలి. పొడి వాతావరణాన్ని కల్పించడం అవసరం. చలిలో దూడలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పశువులు అనారోగ్యానికి గురికాకుండా క్రిమిసంహారక మందులతో కొట్టాలను శుభ్రం చేయాలి. వాటికి తాగడానికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి.

సమయానికి టీకాలు వేయించాలి పశువుల్లో రక్తప్రసరణ మెరుగుపడేందుకు తగు చర్యలు తీసుకోవాలి. గజ్జి, గొంతునొప్పి, కుంటి, మశూచి తదితర వ్యాధులకు టీకాలు వేయించాలి. దూడలు దగ్గు, న్యుమోనియా, చలిలో కోరింత దగ్గు ఉంటే.. పశువైద్యునితో సంప్రదించిన తర్వాత మందులు వేయాలి. ఈ సీజన్‌లో జంతువులకు మినరల్స్ ఉండే ఆహారం అందించాలి. దీని కోసం పచ్చి మేతను ఎక్కువగా వేయాలి.

Yamaha FZS: యమహా ఎఫ్‌జెడ్ ఎస్‌ కేవలం 28 వేలు మాత్రమే..! డీల్‌ ఏంటో తెలుసా..?

ఆస్ట్రేలియాలో విధ్వంసం సృష్టించిన కరేబియన్‌ ఆల్‌రౌండర్.. కేవలం 21 బంతుల్లో మ్యాచ్‌ రూపురేఖలు మార్చేశాడు..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ ఎలా పొందాలో తెలుసా..! ఈ పద్దతులు పాటించండి..