EPFలో నామినీ పేరు తప్పనిసరి.. ఒకవేళ మార్చాలంటే ఆన్‌లైన్‌లో ఇలా చేయండి..

EPF: PF ఖాతాదారులందరూ నామినీ పేరును నమోదు చేసుకోవడం తప్పనిసరి. దీని కోసం EPFO ​​ఈ-నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

EPFలో నామినీ పేరు తప్పనిసరి.. ఒకవేళ మార్చాలంటే ఆన్‌లైన్‌లో ఇలా చేయండి..
Epfo
Follow us

|

Updated on: Dec 14, 2021 | 10:07 AM

EPF: PF ఖాతాదారులందరూ నామినీ పేరును నమోదు చేసుకోవడం తప్పనిసరి. దీని కోసం EPFO ​​ఈ-నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇది పూర్తిగా డిజిటల్. దీని కోసం PF కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీ PF ఖాతాకు నామినీ పేరును చేర్చుకోవచ్చు. సామాజిక భద్రత, PF, EPS, EDLI బీమా ప్రయోజనాలను పొందడానికి ఆన్‌లైన్ ఈ-నామినేషన్ అవసరం. ఒకవేళ నామినీ పేరు లేకుంటే ఇప్పుడే ఆన్‌లైన్‌లో నమోదు చేయండి. అందులో ఏవైనా మార్పులు చేయాలనుకున్నా చేయండి.

కొత్త నామినీని ఈ-నామినేషన్ ద్వారా మాత్రమే PF ఖాతాలో చేర్చాలి. దీని కోస సభ్యుడు EPFO ​​వెబ్‌సైట్ epfindia.gov.in ని సందర్శించాలి. ఈ-నామినేషన్‌కు సంబంధించిన మొత్తం సమాచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఫారమ్‌లో అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత కొత్త నామినీ పేరును చేర్చవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ​​ప్రావిడెంట్ ఫండ్‌ను నిర్వహిస్తుంది. EPFO పెన్షన్ ఫండ్, PF లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను కూడా అందిస్తుంది. ఈ అన్ని సేవల ప్రయోజనాన్ని పొందడానికి నామినీ పేరు తప్పనిసరిగా ఉండాలి. నామినీ పేరును మార్చమని EPFOని అడగాల్సిన అవసరం లేదు. PF నామినేషన్‌లో నమోదు చేసిన తాజా పేరు మాత్రమే చట్టపరమైన హోదా కల్పిస్తారు. కొత్త పేరు చేరికతో పాత పేరు చెల్లదు. PF నామినీ పేరును ఎలా మార్చాలో కొత్త పేరును ఎలా చేర్చాలో తెలుసుకుందాం.

నామిని పేరు ఎలా చేర్చాలో తెలుసుకుందాం.. 1. epfindia.gov.inలో EPFO ​​అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి 2. ‘సర్వీసెస్’కి వెళ్లి, డ్రాప్ డౌన్‌లో ‘ఉద్యోగుల కోసం’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి 3. ఇప్పుడు ‘మేనేజ్’ ట్యాబ్ కింద మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి 4. ‘మేనేజ్‌మెంట్’ ట్యాబ్ కింద ‘ఈ-నామినేషన్’పై క్లిక్ చేయండి 5. మీ కుటుంబ ప్రకటనను నవీకరించడానికి ‘అవును’ క్లిక్ చేయండి 6. ఇప్పుడు ‘కుటుంబ వివరాలను కలపండి ఎంపికను ఎంచుకోండి. మీరు మరొక నామినీ పేరును కూడా చేర్చవచ్చు. 7. ‘నామినేషన్ వివరాలు’పై క్లిక్ చేయండి 8. డిక్లరేషన్ తర్వాత, ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి 9. OTPని రూపొందించడానికి ‘e-Sign’ని ఎంచుకోండి 10. ఆధార్ కార్డ్‌తో లింక్ చేయబడిన మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఫిల్‌ చేయండి. 11. మీ ఈ-నామినేషన్ ఇప్పుడు EPFOలో నమోదు అయింది.

PMFBY: రైతులకు గమనిక.. ఫసల్‌ బీమా యోజన వివరాలు వెల్లడించిన కేంద్రం..

పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా..! నొప్పి లేకుండా ఇలా తగ్గించుకోండి..

Australia: ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. 15 మంది ఆటగాళ్ల పేర్లు ఖరారు..