AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

UPSC ies iss Final Result 2021: ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విడుదల అయ్యాయి.

UPSC ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
Upsc
uppula Raju
|

Updated on: Dec 14, 2021 | 1:48 PM

Share

UPSC ies iss Final Result 2021: ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విడుదల అయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా రిజల్ట్‌ తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 26 పోస్టులను భర్తీ చేస్తున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ IES, ISS పరీక్షల కోసం దరఖాస్తు ప్రక్రియను 08 ఏప్రిల్ 2021 నుంచి ప్రారంభమైంది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 15 నుంచి 28 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ పరీక్షలో మొత్తం 31 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్‌కు హాజరయ్యారు. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌లో మొత్తం 22 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ హాజరయ్యారు.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. 1. అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించండి. 2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో కొత్తగా ఉన్నవాటికి వెళ్లండి. 3. ఇందులో ఇంజనీరింగ్ సర్వీసెస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ISS ఎగ్జామినేషన్, 2021 లింక్‌కి వెళ్లండి. 4. ఇప్పుడు ఇంజినీరింగ్ సర్వీసెస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ISS ఎగ్జామినేషన్, 2021, ఫైనల్ రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి. 5. ఇక్కడ ఫలితం PDF ఫైల్ ఓపెన్ అవుతుంది 6. ఇందులో మీ విభాగం పేజీకి వెళ్లండి. 7. ఇక్కడ మీరు మీ రూల్‌ నంబర్, పేరు సహాయంతో ఫలితాన్ని తనిఖీ చేయండి 8. ఫలితం PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. మొత్తం 26 పోస్ట్‌లు భర్తీ చేస్తారు. ఇందులో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్)లో 15 పోస్టులు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్)లో 11 పోస్టులు ఖరారయ్యాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధిత విభాగాల్లో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఫలితాలు ప్రచురించిన 15 రోజుల తర్వాత అభ్యర్థుల మార్కులు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులకు ఫలితాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, వారు 011-23385271/3381125లో సంప్రదించవచ్చు.

Ola Electric Scooter: ఓలా బుకింగ్‌ దారులకు గుడ్ న్యూస్‌.. డిసెంబర్‌ 15 నుంచి డెలివరీ ప్రారంభం..

PM modi: ప్రధాని మోదీ సందర్శించే స్వర్వేద ఆలయం గురించి మీకు తెలుసా..? ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం..

PM Kisan: రైతులు అలర్ట్‌.. పదో విడత రాకముందే ఈ పని పూర్తి చేయండి.. లేదంటే..?