AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM modi: ప్రధాని మోదీ సందర్శించే స్వర్వేద ఆలయం గురించి మీకు తెలుసా..? ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం..

PM modi: ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్నారు. తన పర్యటన సందర్భంగా మంగళవారం వారణాసిలోని

PM modi: ప్రధాని మోదీ సందర్శించే స్వర్వేద ఆలయం గురించి మీకు తెలుసా..? ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం..
Meditation
uppula Raju
|

Updated on: Dec 14, 2021 | 12:24 PM

Share

PM modi: ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్నారు. తన పర్యటన సందర్భంగా మంగళవారం వారణాసిలోని స్వర్వేద్‌ ఆలయాన్ని సందర్శిస్తారు. దాదాపు గంటన్నర పాటు స్వర్వేడ్ టెంపుల్‌లో మోదీ కార్యక్రమం ఉంటుంది. అయితే స్వర్వేద్‌ టెంపుల్ గురించి ఎంతమందికి తెలుసు. ఎందుకంటే ఈ ఆలయం ప్రత్యేక పద్దతిలో నిర్మించారు. చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మందికి పైగా ధ్యానం చేయవచ్చు అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం.

ప్రధాని మోదీ సందర్శన వల్ల ఈ ఆలయం గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఎవరి గుడి, ఈ ఆలయంలో ఏ దేవుడు ఉంటాడు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం. ఈ దేవాలయం పేరు స్వర్వేద్‌ ఆలయం. స్వః, వేదం అనే రెండు పదాలు అర్థవంతమైనవి. అంటే స్వాః అంటే ఆత్మ, వేదం అంటే జ్ఞానం. ఈ ఆలయంలో ఏ దేవడిని పూజించరు. కేవలం ధ్యానం మాత్రమే చేస్తారు ఇది ధ్యాన స్థలం మాత్రమే.

దీనిని వారణాసిలోని ఉమ్రాలో సద్గురు సదాఫల్ దేవ్ విహంగం యోగ సంస్థాన్ నిర్మించారు. స్వర్వేద్ మహామందిర్ నిర్మాణ పనులు 2014 నుంచి ప్రారంభమయ్యాయి. ఇది ఇప్పటివరకు నిరంతరం కొనసాగుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం. భారత స్వాతంత్ర్య అమర యోధుడు, సద్గురు సదాఫల్‌దేవ్ విహంగం యోగా సెయింట్ సమాజ్ మహర్షి సదాఫల్‌దేవ్ జీ మహారాజ్‌కి సంబంధించినది. మహర్షి సదాఫల్‌దేవ్ జైల్ యాత్ర శతాబ్ది ఉత్సవం సందర్భంగా డిసెంబరు 14న స్వర్వేద్ ఆలయంలో కార్యక్రమం జరుగుతోంది.

ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి? స్వర్వేద్ మహామందిర్ ఏడు అంతస్తులు, 64 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 35 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం. కాశీలో నిర్మించిన స్వర్వేద దేవాలయం 180 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ సూపర్ స్ట్రక్చర్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఆలయంలో మక్రానా పాలరాయి ఉపయోగించారు. తామరపువ్వు ఆకారంలో గోపురం ఉంటుంది.

PM Kisan: రైతులు అలర్ట్‌.. పదో విడత రాకముందే ఈ పని పూర్తి చేయండి.. లేదంటే..?

పాపం ప్రియుడు.. ప్రియురాలి జుట్టు వాసన భరించలేకపోయాడు.. ఏం చేశాడంటే..?

EPFలో నామినీ పేరు తప్పనిసరి.. ఒకవేళ మార్చాలంటే ఆన్‌లైన్‌లో ఇలా చేయండి..