Villages Empty: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 59 గ్రామాలు ఎడారిని తలపిస్తున్నాయి. ఎక్కడ, ఎందుకో..?

భారత సరిహద్దుల్లో చైనా కొత్తగా గ్రామాలను నిర్మిస్తోందని, ప్రజలను తరలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ వైపు చైనా-నేపాల్‌ సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Villages Empty: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 59 గ్రామాలు ఎడారిని తలపిస్తున్నాయి. ఎక్కడ, ఎందుకో..?
Pithoragarh Villages
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 14, 2021 | 12:57 PM

Ghost villages in Pithoragarh: భారత సరిహద్దుల్లో చైనా కొత్తగా గ్రామాలను నిర్మిస్తోందని, ప్రజలను తరలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ వైపు చైనా-నేపాల్‌ సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దులను విడిచి వలస వెళుతున్నారు ప్రజలు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పిథోరాగఢ్‌ జిల్లాలో చైనా-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న 59 గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఏ గ్రామం చూసినా మనిషి జాడ కనిపిండం లేదు. పిథోరాగఢ్‌ జిల్లాలో ప్రస్తుతం 1542 గ్రామాల్లోనే ప్రజలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఆ సంఖ్య 1601గా ఉండేది. 59 గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి.

ఇందులో పిథోరాగఢ్‌ ఏరియాలో 13, గంగోలీహాట్, డీడీహాట్, బెరీనాగ్‌ తాలుకాల్లో ఒక్కోదాంట్లో ఆరు, ధారచూలాలో 3, గణాఈ-గంగోలీ, ఫాంఖూ, థాల్‌లో 3 చొప్పున గ్రామాలు ఖాళీ అయ్యాయి. మూడేళ్ల క్రితం గ్రామాల్లో 16వేల మంది జనాభా ఉండేదని వివరించారు జల్‌ నిగమ్‌ అధికారి రంజీత్‌ ధర్మసత్తూ. 2019, 2020, 2021లో ఇంటింటి సర్వే చేపట్టామని, బ్రాహ్మణ క్షేత్రంలోని 1601 గ్రామాల్లో సుమారు 40 నుంచి 50 గ్రామాలు గడిచిన మూడేళ్లలో దాదాపుగా ఖాళీ అయ్యాయి అని తెలిపారు, జల్‌ నిగమ్‌ అధికారి రంజీత్‌ ధర్మసత్తూ.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడి 21 ఏళ్లు గడుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కోసం రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించాయి. కానీ, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కనీస వసతులు లేవు. చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవు. విద్యుత్తు, నీరు, సమాచారం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల వలసలు పెరుగుతున్నాయి. సరైన వైద్య సౌకర్యం లేకపోవడమే వలసలకు ప్రధాన కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదే అంశానికి సంబంధించి పిథోరఘర్ జిల్లా అభివృద్ధి అధికారి గోపాల్ గిరి గోస్వామి మాట్లాడుతూ, “రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో, ఉపాధి అవకాశాలు తగ్గుతుండటంతో ఈ గ్రామాల నుండి ప్రజలు వలస వెళ్లడానికి ప్రధాన కారణాలు.” అని అన్నారు. జిల్లాలోని భటాడ్ గ్రామానికి చెందిన ప్రకేష్ పాండే మాట్లాడుతూ, “మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాల కోసం ప్రజలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. అంతేకాకుండా, ఆరోగ్య మరియు విద్య సౌకర్యాల కొరత స్థానికులను పట్టణ కేంద్రాలకు తరలించడానికి ప్రేరేపిస్తుంది. ఈ గ్రామాల్లో వ్యవసాయ భూములు బీడుగా మారాయని, చిరుతపులి వంటి వన్యప్రాణులు తరచూ సంచరిస్తున్నాయని తెలిపారు.

Read Also…  Winter Health Tips: చలికాలపు ఆరోగ్య చిట్కాలు.. జలుబు, ఫ్లూ నిరోధించడానికి అద్భుతమైన ఐదు చిట్కాలు..!