Burger eating: 24 నిముషాల్లో ఇన్ని బర్గర్లు ఎలా లాగించాడు .. ఫుడ్ ఛాలెంజ్ పోటీల్లో కైలీ.. ఎట్రాక్ట్ చేస్తున్న వీడియో..
ఫుడ్ ఛాలెంజ్ పోటీల్లో ప్రైజ్‌లు గెలుచుకునే వారిని ఎక్కువగా మనం విదేశాల్లో చూస్తుంటాం. ఇందుకు వీరు పడే తంటాలు.. ముందస్తు ప్రిపరేషన్ భారీగా ఉంటుంది. వారి టాలెంట్‌ను తక్కువ అంచనా వేయలేం.
ఫుడ్ ఛాలెంజ్ పోటీల్లో ప్రైజ్‌లు గెలుచుకునే వారిని ఎక్కువగా మనం విదేశాల్లో చూస్తుంటాం. ఇందుకు వీరు పడే తంటాలు.. ముందస్తు ప్రిపరేషన్ భారీగా ఉంటుంది. వారి టాలెంట్‌ను తక్కువ అంచనా వేయలేం. సాధారణంగా ఎవరైనా ఒకటి లేదా రెండు బర్గర్లు తినగానే ఇక మావల్లకాదని చేతులెత్తేస్తారు! అలా కాదని బలవంతంగా ఎక్కిస్తే ఇక వాంతులే.. కానీ ఓ వ్యక్తి కేవలం 24 నిముషాల్లో ఎన్ని బర్గర్లు తిన్నాడో తెలిస్తే… ఖచ్చితంగా నోరెళ్ళబెడతారు.ఇంగ్లాండ్‌కు చెందిన 23 ఏళ్ళ కైలీ గిబ్సన్ ‘మెక్‌డోనల్డ్స్ క్రిస్టమస్ ఛాలెంజ్’లో పాల్గొన్నాడు. కేవలం 24 నిముషాల్లో ఏకంగా 6 బర్గర్లు లాగించేశాడు. పైగా ఇదంతా నాకు చాలా మామూలు విషయమని అంటున్నాడు కూడా. నిజానికి కైలీ గిబ్సన్ ప్రొఫెషనల్ ఈటర్. గత కొన్నేళ్ళుగా ప్రతిరోజూ లెక్కలేనన్ని లార్జ్ మీల్ ఈటింగ్ కాంపిటీషన్లలో పాల్గొంటున్నాడట కూడా. వీటికి సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఎకౌంట్లలో పోస్ట్ చేస్తుంటాడు. ఐతే తినడం వరకూ సరే! మరి తిన్నదంతా ఎలా అరిగించుకుంటాడనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. అతని సమాధానం ఏమిటో తెలుసా.. కాంపిటీషన్‌లో పాల్గొనడానికి ముందు, తిన్న తర్వాత భారీ స్థాయిలో వర్క్‌ఔట్స్ చేస్తానని చాలా తేలిగ్గా చెప్పేస్తున్నాడు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

