AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health Tips: చలికాలపు ఆరోగ్య చిట్కాలు.. జలుబు, ఫ్లూ నిరోధించడానికి అద్భుతమైన ఐదు చిట్కాలు..!

Winter Health Tips: ముందే వైరస్‌ కాలం కొనసాగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా మహమ్మారితో పాటు ఇతర వైరస్‌లు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఇక చలికాలంలో..

Winter Health Tips: చలికాలపు ఆరోగ్య చిట్కాలు.. జలుబు, ఫ్లూ నిరోధించడానికి అద్భుతమైన ఐదు చిట్కాలు..!
Subhash Goud
|

Updated on: Dec 14, 2021 | 12:59 PM

Share

Winter Health Tips: ముందే వైరస్‌ కాలం కొనసాగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా మహమ్మారితో పాటు ఇతర వైరస్‌లు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఇక చలికాలంలో మరిన్ని వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. దగ్గు, జలుబు, ప్లూ లాంటి బారిన పడి వ్యాధి నిరోధక శక్తి కోల్పోతుంటాము. అలాంటిది రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ముందస్తుగా కొన్ని చిట్కాలను పాటిస్తే ఎంతో మేలంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

ఫ్లూ నిరోధించడానికి ఆహారాలు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఈ ఐదింటిని పాటిస్తే మేలు..

నారింజ: శీతాకాలంలో పండ్లను సమృద్ధిగా తీసుకోవాలి. అందులో నారింజ చాలా ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి. ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు, ఎన్నో పోషకాలు లభిస్తాయి.

మసాలా టీ: చలికాలంలో మసాలా టీ ఉపయోగకరంగా ఉంటుంది. లవంగం, దాల్చినచెక్క మరియు మరిన్ని మసాలా దినుసులతో తయారుచేసిన చాయ్ (పాలతో లేదా పాలు లేకుండా) మన రోజువారీగా తీసుకుంటే ఎంతో మేలంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అలాగే జలుబు, ఫ్లూని నివారించడానికి మరింత సహాయపడుతుంది.

వెల్లుల్లి: వెల్లుల్లి వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి. వంటింట్లో ఉండే ఈ వెల్లుల్లి రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. వెల్లుల్లిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఎన్నో పోషకాలు అందుతాయి. వివిధ అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, అనేక అనారోగ్య సమస్యలతో పోరాడటానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలతో నిండి ఉంటుంది.

పసుపు: పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది కూడా వంటింట్లో విరివిగా లభిస్తుంది. పసుపుతో ఉన్న ప్రయోజనాలు ఇన్నీ ఇన్నీ కావు. పసుపులో కర్కుమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు, క్రిమినాశక, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీని వల్ల పేగు సమస్యలు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

తేనె: మీకు తీవ్రమైన దగ్గు, జలుబు ఉంటే తక్షణ ఉపశమనం అందించడానికి తేనె ఎంతగానో సహాయపడుతుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. తక్షణ ఉపశమన ప్రభావాన్ని అనుభవించడానికి కొంత అల్లం సారంతో తేనెను జత చేయండి. ఆ తర్వాత రోజువారీగా తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇందులో కూడా మంచి పోషక విలువలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Iron Ddeficiency: శరీరంలో ఐరన్ లోపిస్తే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి..!

Omicron Variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎక్కువగా వీరికే సోకుతుంది.. తాజా పరిశోధనలో వెల్లడి..!

మీ చేతులు పట్టు తప్పుతున్నాయా..? చేతుల్లోంచి తరచూ వస్తువులు జారీ పడిపోతున్నాయా..? ఈ వ్యాధులకు గురవుతున్నట్లే!