Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా వీరికే సోకుతుంది.. తాజా పరిశోధనలో వెల్లడి..!
Omicron Variant: ఒమిక్రాన్.. ఇప్పుడిది మళ్లీ ప్రపంచ దేశాలు వణికిపోయేలా చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఈ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేస్తోంది..
Omicron Variant: ఒమిక్రాన్.. ఇప్పుడిది మళ్లీ ప్రపంచ దేశాలు వణికిపోయేలా చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఈ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేస్తోంది. ఈ కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో మరో కొత్త వేవ్ రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ భారీ స్థాయిలో విజృంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పరిశోధన సంస్థలు సర్వే నిర్వహించాయి. కొత్త వేరియంట్ వల్ల సామాన్య బరువు గల వ్యక్తుల కంటే ఊబకాయులకు రెండు రేట్లు ప్రమాదం ఉండే అవకాశం ఉందని తేలింది.
అయితే కరోనా సోకిన వారు ఐసీయూలో చేరిన వారు ఊబకాయులో ఉన్నారు. ఊబకాయుల్లో బీఎంఐ ఎక్కువగా ఉన్నందు వల్ల వారిలో ఊపిరి పీల్చుకునే సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల ఊబకాయులలో కరోనా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.
పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం..
ఈ ఒమిక్రాన్ పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉండబోతోందనే విషయంపై కూడా పరిశోధనలు నిర్వహించారు. కెనడా, ఇరాన్, కోస్టారికా తదితర దేశాలలోని 400 పిల్లలపై సర్వే నిర్వహించారు పరిశోధకులు. దీంతో ఊబకాయులైన పిల్లలు కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ సర్వే ఫలితాలు PLOS ONE అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ ఒమిక్రాన్‌పై ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా ఎలాంటి ప్రభావం ఉండబోతోందనే విషయంపై అధ్యయనం కొనసాగిస్తున్నట్లు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్‌తో పాటు దక్షిణాఫ్రికాలోని స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు.
యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు
ప్రపంచ దేశాలను వెంటాడుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. యూకేలో వేగంగా వ్యాపిస్తోంది. ఇక్కడ అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.
ఇవి కూడా చదవండి: