AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ చూపు మందగిస్తున్నట్లయితే భోజనం చేసిన తర్వాత ఇలా చేయండి..

ఆహారం తిన్నాక తరచు ఏదో స్వీట్ తినాలని అనిపిస్తుంది.. అలా అని రోజూ స్వీట్లు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అదే మనం రెస్టారెంట్‌కు కానీ హోటల్‌లో భోజనం చేసిన తర్వాత..

Health Tips: మీ చూపు మందగిస్తున్నట్లయితే భోజనం చేసిన తర్వాత ఇలా చేయండి..
Fennel And Sugar Candy
Sanjay Kasula
|

Updated on: Dec 13, 2021 | 8:37 PM

Share

ఆహారం తిన్నాక తరచు ఏదో స్వీట్ తినాలని అనిపిస్తుంది.. అలా అని రోజూ స్వీట్లు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అదే మనం రెస్టారెంట్‌కు కానీ హోటల్‌లో భోజనం చేసిన తర్వాత నావోత్‌ కలిపిన సోంపు అందిస్తారు. ఇలా ఎందుకు అందిస్తారో చాలా మందికి తెలియదు. అందులో ఆరోగ్య రహస్యం దాగివుంది. ఈ రెండింటిలోనూ జింక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, పొటాషియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని తెలుసా? కొంతమంది దీనిని నమ్మరు కానీ ఇది నిజం. ఎందుకంటే ఇది కేవలం మౌత్ ఫ్రెషనర్ అని మనమందరం అనుకుంటున్నాం.. కానీ అది కాదు ఇందులో చాలా విషయం ఉంది. అదేంటో తెలుసుకుందాం.

సోంపు, నవోతు మీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసా..

1. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది

సాధారణంగా మౌత్ ఫ్రెష్ కోసం సోంపు వినియోగిస్తారు. అయితే ఇది ఆహారాన్ని జీర్ణం చేసే రూపంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు తిన్న తర్వాత నవోతు తినాలి. ఇది మీ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

2. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచండి

మీలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగేందుకు సహాయ పడుతుంది. రక్తహీనతకు చెక్ పడుతుంది. చర్మం పేలవంగా మారడం, తల తిరగడం, నీరసం వంటి అనేక సమస్యలకు ఇది పరిష్కారం అని చెప్పవచ్చు. మీరు సోంపు, నవోతు కలిపి తీసుకుంటే రక్తం స్థాయిని పెంచుకోవచ్చు.

3. దగ్గు – జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది

చల్లని వాతావరణం ప్రారంభంతో సాధారణంగా ప్రతి ఒక్కరికి దగ్గు, గొంతు నొప్పి వస్తుంది. దీని నుండి ఉపశమనం కోసం సోంపుతోపాటు నవోతు తీసుకోవచ్చు. నవోతులో ఉండే ఔషధ గుణాలు.. అవసరమైన పోషకాల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది.

కొన్నిసార్లు మనం నోటి దుర్వాసనను కలిగించే కొన్నింటిని తింటాం. కాబట్టి సోంపు, నవోతు నోటి దుర్వాసనను తొలగించడానికి ఉత్తమ మార్గం. ఇది కాకుండా బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది.

5. కంటి చూపుకు మేలు చేస్తుంది

సోంపు, నవోతు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు దృష్టి మెరుగుపడుతుంది. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చూపు మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి: CM KCR: శ్రీరంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. మంగళవారం తమిళనాడు సీఎంతో ప్రత్యేక సమావేశం..

SMART Success: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. స్మార్ట్ ప్రయోగం విజయవంతం