మీ చేతులు పట్టు తప్పుతున్నాయా..? చేతుల్లోంచి తరచూ వస్తువులు జారీ పడిపోతున్నాయా..? ఈ వ్యాధులకు గురవుతున్నట్లే!

కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు మనకు ముందుగానే సంకేతాలు ఇస్తుంటాయి. వాటిని గమనించి ముందస్తుగా వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స తీసుకుంటే ఎంతో మంచిది. కానీ..

మీ చేతులు పట్టు తప్పుతున్నాయా..? చేతుల్లోంచి తరచూ వస్తువులు జారీ పడిపోతున్నాయా..? ఈ వ్యాధులకు గురవుతున్నట్లే!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 13, 2021 | 5:27 PM

కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు మనకు ముందుగానే సంకేతాలు ఇస్తుంటాయి. వాటిని గమనించి ముందస్తుగా వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స తీసుకుంటే ఎంతో మంచిది. కానీ అలాంటి సంకేతాలు మనకు పెద్దగా గమనించి ఉండము. ఈ మధ్య కాలంలో చాలా మందికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే రోజు వారీ ఒత్తిడి, మానసిక ఆందోళన, ఆర్థిక సమస్యలు తదితర కారణాల వల్ల మనిషి టెన్షన్‌కు గురై అనారోగ్యం బారిన పడిపోతున్నాడు. మన జీవన శైలిని మార్చుకుంటే ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇక మీ చేతులు పట్టు తప్పుతున్నాయా? అయితే మీరు త్వరలోనే భారీ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని సంకేతాలు. మీ చేతుల్లోంచి తరచూ వస్తువులు జారి కిందపడిపోతున్నాయా? అయితే మీరు గుండెకు సంబంధించిన లేదా మెదడుకు సంబంధించి.. నాడీ వ్యవస్థకు, నరాల పటుత్వానికీ సంబంధించిన అనారోగ్యానికి చేరువ అవుతున్నారని అర్థం.

ఇటీవల కొన్ని వైద్య పరిశోధనలు ఈ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చాయి. సాధారణంగా ఇలా చేయి పట్టుచిక్కకపోవడాన్నీ, పట్టుజారిపోవడాన్నీ ఎవరూ పెద్దగా పట్టించుకోరు.తరచూ చేతుల్లోంచి చిన్నచిన్న వస్తువులుకూడా జారి కిందపడిపోవడాన్ని కూడా ఎవరూ పట్టించుకోరు. కానీ అవన్నీ పూర్తిగా మీకు త్వరలోనే గుండెకు, మెదడుకు, నాడీ వ్యవస్థకు లేదా నరాల బలహీనతకు సంబంధించిన తీవ్రస్థాయి అనారోగ్యం కలగబోతోందన్న హెచ్చరికలకు సంకేతాలని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా మీ శరీరానికి సంబంధించిన అనేక రకాల రుగ్మతలు, అనారోగ్యాలకు ఇలా పట్టు జారిపోవడాన్ని సూచనగా భావించాలని చెబుతున్నారు.

ఇటీవల జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ లో ప్రచురితమైన ఓ ప్రత్యేకమైన వార్త ఈ నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మీ చేతులు పట్టుతప్పడం, పట్టుజారిపోవడం త్వరలోనే మీకు చిత్త వైకల్యానికి సంబంధించిన జబ్బులు రావడానికి సూచనగా భావించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. 30 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి సాధారణంగా కనీసం 40 కేజీల బరువును అలవోకగా మోయగలుగుతాడు. దానిపై తనకు కచ్చితంగా పట్టు ఉంటుంది. ఈ సామర్ధ్యం ఎంతో కొంత తగ్గినా సరే కచ్చితంగా అది రాబోయే రోజుల్లో కొని తెచ్చుకోబోయే అనారోగ్యానికి సంకేతమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి ఐదు కిలోల బరువుకూ ఈ సామర్ధ్యాలు తగ్గుతున్నకొద్దీ దాదాపుగా 18 శాతం మీరు పైన చెప్పుకున్న ఆనారోగ్యాలకు చేరువ అవుతున్నట్టే లెక్కని వైద్యులు అంటున్నారు.

ఆరోగ్యంపై దృష్టి సారించాలి.. ప్రతి మనిషి తన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 40 సంవత్సరాల వయసు దాటిని దగ్గరినుంచి ఈ సామర్ధ్యం మెల్లమెల్లగా తగ్గడం మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంటే మెల్లమెల్లగా కండరాల బిగువుకూడా తగ్గిపోతున్నట్టు లెక్కని అంటున్నారు. అయితే దీని ప్రభావం పూర్తి స్థాయిలో అప్పటికప్పుడే కనిపించాల్సిన అవసరం లేదని, 70 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో దానివల్ల ఎదురయ్యే విషమ పరిణామాలు బయటపడతారని చెబుతున్నారు.

శరీరంలో అవయవాల పటుత్వం కోసం.. దాదాపుగా ప్రతి మనిషికి ఒక దశాబ్దానికి 3 నుంచి 5 శాతం మజిల్ మాస్ పవర్ తగ్గిపోతుందని వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని మిగతా అవయవాల పటుత్వం కోసం రోజూ వ్యాయామం చేసేవాళ్లే తప్ప చేతుల్లోని, మణికట్టులోని కండరాల పటుత్వాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేసేవాళ్లు సంఖ్య పెద్దగా కనిపించదని నిపుణులు అంటున్నారు. కేవలం చిన్న చిన్న గ్రిప్పులు, స్మైలీ బాల్స్ సాయంతో రోజూ కొంత సేపు ప్రత్యేకంగా చేతి కండరాలను బలపరచుకునేందుకు వ్యాయామం చెయ్యాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలంటున్నారు. ఆర్థరైటిస్, డయాబెటీస్ లేదా ట్రాప్ట్ నెర్వ్ లాంటి ఇబ్బందులవల్ల పూర్తి స్థాయిలో చేతులు పట్టుకోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Alcohol: మద్యం తాగిన తర్వాత మీ శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి

Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్‌ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో