Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్‌ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!

Children Fear: సాధారణంగా పిల్లలు కొత్తవారు అంటే భయపడుతుంటారు. ఇది అందరి పిల్లల్లో ఉండటం సహజమే. పిల్లలు కొత్తవారి దగ్గరికి వెళ్లేందుకు ఇష్టపడరు. ఒక వేళ..

Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్‌ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 12, 2021 | 7:03 AM

Children Fear: సాధారణంగా పిల్లలు కొత్తవారు అంటే భయపడుతుంటారు. ఇది అందరి పిల్లల్లో ఉండటం సహజమే. పిల్లలు కొత్తవారి దగ్గరికి వెళ్లేందుకు ఇష్టపడరు. ఒక వేళ బలవంతంగా తీసుకుంటే ఏడుస్తారు. పిల్లల్లో మూడు, నాలుగు నెలల నుంచే కొత్తవారంటే భయమనేది ఏర్పడుతుంటుంది. ఈ భయం రెండు సంవత్సరాల వరకు ఉంటుందని చైల్డ్‌ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. కొంతమంది పిల్లలకు కొత్త, పాత ఉండదు. ఎలాంటి భయం లేకుండా కొత్తవారి దగ్గరకు కూడా చనువుగా వెళ్లిపోతారు. ఇలాంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు.

తల్లులు చిరాకు పడకూడదు..

చంటి పిల్లల విషయంలో తల్లులు చిరాకు పడుతుంటారు. అలా పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కొంత వరకు సహజమే అయినా ఎక్కువగా భయపడే పిల్లల్లో దీని కారణముగా పెద్దయ్యాక కొన్ని మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉందని చైల్డ్‌ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. చంక దిగడానికి ఏడ్చే పిల్లలను లాలిస్తూ. బజ్జగిస్తూ ఇంట్లో వారిని, ఇరుగు పొరుగువారిని అలవాటు చేస్తూ వారి దగ్గరకు కూడా వెళ్లేటట్లు చేయాలి. తల్లి ఇలా అలవాటు చేయడం వల్ల పిల్లలు క్రమ క్రమంగా ఇతరులంటే భయం లేకుండా వారి దగ్గరకు కూడా వెళ్తుంటారు. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు చంటి పిల్లల విషయంలో ఈ సమస్య తప్పదు. ఇంట్లో ఉండే పెద్దవారికి గానీ, పిల్లలకు గానీ పిల్లలను ముందు కొంత ఓర్పుతో అలవాటు చేయాలి.

బలవంతంగా పిల్లలను ఇతరులకు అప్పగించం, వారు బిగ్గరగా ఏడవడం వల్ల వాళ్లలో భయం ఇంకా పెరుగుతూ ఉంటుంది. బుజ్జగింపు మాటలతో, చేతలతో ఇతరులు కూడా మన వాళ్లేనన్న భావాలను పిల్లలకు కలిగిస్తూ నిదానంగా పిల్లల్లో భయం పోగొట్టాలి. భయం పోయిన పిల్లలు ఇతరులపై నమ్మకం, వారి పట్ల ఇష్టాన్ని కూడా పెంచుకుంటారు. ఇదే కాకుండా పిల్లల్లో వయసు పెరుగుతున్నా రకరకాల భయాలు ఉంటాయి. వాటిని గమనించి అటువంటి భయాలను తొలగించడానికి ప్రయత్నించాలి.

పిల్లల్లో కోపం..

కొంత మంది పిల్లలు చిన్ననాటి నుంచే కోపం తెచ్చుకుంటారు. అలాంటి పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. పెద్ద పట్టణాలలో తల్లిదండ్రులు తమ పిల్లలపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. ఏదో పని ఇవ్వడ అనే నెపం మీద వాళ్లకు మొబైల్‌ ఫోన్లు ఇస్తున్నారు. అలాంటి సందర్భాలలో పిల్లలు మొబైల్‌ ఫోన్లలో హింసాత్మక ధోరణి కలిగిన గేమ్స్‌ ఆడటం వల్ల వల్లలో కోపం అనేది పెరిగిపోతుందంటున్నారు. మొబైల్‌ ఫోన్లలో గేమ్స్‌ ఆడటం వల్ల ఫోన్లు వారి మనస్తత్వాన్ని మెల్లగా మార్చేస్తాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Alcohol: మద్యం తాగిన తర్వాత మీ శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి

Hindu Temple: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా..?

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి