Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. ఆదివారం రాశిఫలాలు..

Today Horoscope: ప్రతిరోజూ ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు

Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. ఆదివారం రాశిఫలాలు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 12, 2021 | 6:58 AM

Today Horoscope: ప్రతిరోజూ ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. కావున ఆదివారం (డిసెంబర్ 22న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేషం: ఈ రాశివారు చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ ధైర్యంతో ముందడుగు వస్తే విజయం వరిస్తుంది. బంధు మిత్రులతో, సన్నిహితులతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. అపార్థాలు, అనుమానాలకు దూరంగా ఉండాలి.

వృషభం: ఈ రాశివారు చేపట్టిన పనులు, కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అన్నిరంగాల వారికి ప్రతిభకు తగ్గ ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటే మంచిది.

మిథునం: ఈ రోజు మొదలు పెట్టిన అన్ని పనులను పూర్తి చేస్తారు. బంధువులతో, సన్నిహితులతో ఆనందంగా ఉంటారు. ఇష్టమైన పనులపై దృష్టిసారిస్తే మంచి లాభాలుంటాయి.

కర్కాటకం: ఆయా రంగాల వారికి మిశ్రమ వాతావరణం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదోవ పట్టించేవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై దృష్టిసారించాలి.

సింహం: ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమ పెరుగుతుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే పనులన్నీ పూర్తవుతాయి. సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

కన్య: ఈ రాశి వారికి శుభకాలం. అన్ని రంగాల వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది.

తుల: ఈ రోజు చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉన్నతులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

వృశ్చికం: ఈ రాశివారు ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అనుకున్నది పూర్తిచేస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగితే లాభం చేకూరుతుంది.

ధనుస్సు: ఆయా రంగాల వారు ఆచితూచి ముందడుగు వేయాలి. ముఖ్య విషయాల్లో జాప్యం వద్దు. ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతుంది. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. నవగ్రహ శ్లోకాలను చదవండి.

మకరం: ఈ రోజు ఈ రాశివారికి శుభకాలం. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సన్నిహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. నూతనంగా చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది.

కుంభం: ఈ రాశివారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు విచారాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా వివాదాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది.

మీనం: ఈ రోజు ముఖ్యమైన సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. సమయానికి సాయం అందుతుంది. కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read:

Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌..!

Hindu idol: యూపీలో అదృశ్యమైన విగ్రహం ఇంగ్లాడ్‌లో ప్రత్యక్షం.. త్వరలోనే భారత్‌కు..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!