Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌..!

Modi Twitter Account Hacked: హ్యాకర్స్‌ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యనేతల ట్విటర్‌ అకౌంట్లపై కన్నేశారు. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌..

Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌..!
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Dec 12, 2021 | 7:08 AM

Modi Twitter Account Hacked: హ్యాకర్స్‌ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యనేతల ట్విటర్‌ అకౌంట్లపై కన్నేశారు. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతుండగా, తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది. బిట్ కాయిన్లను లీగల్ చేశామంటూ  హ్యాకర్స్ ట్వీట్ చేశారు. 500బిట్ కాయిన్లను పౌరులకు పంచుతున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైందంటూ పీఎంఓ (PMO) అధికారికంగా ప్రకటించింది.

అయితే ప్రధాని మోడీ అకౌంట్‌ ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో హ్యాకర్స్ హ్యాక్‌ గురైంది. ఈ విషయాన్ని పీఎంఓ తన ట్విటర్‌ అకౌంట్‌ హ్యాండిల్‌ ద్వారా ఆదివారం 3 గంటలకు తెలిపింది. ఈ విషయాన్ని వెంటనే ట్విటర్‌కు తెలిపినట్లు పీఎంవో వెల్లడించింది. దీంతో ట్విట్టర్‌ ప్రధాని అకౌంట్‌కు భద్రత కల్పించింది. అయితే గతంలోనే మోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. ఆ సమయంలో క్రిప్టో కరెన్సీ రూపంలో మోడీ సహాయనిధికి విరాళాలు ఇవ్వాలంటూ ట్వీట్లు కూడా చేశారు.

Modi 1

ఇవి కూడా చదవండి:

Trai: నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్లపై ట్రాయ్‌కి ఫిర్యాదులు.. అధికంగా ఎయిర్‌టెల్‌పైనే..!

5G Technology: జనవరిలో ‘టెస్ట్‌బెడ్‌’.. 5జీ టెక్నాలజీ కోసం ప్రయోగాత్మకంగా పరీక్షలు..!