5G Technology: జనవరిలో ‘టెస్ట్‌బెడ్’.. 5జీ టెక్నాలజీ కోసం ప్రయోగాత్మకంగా పరీక్షలు..!
5G Technology: టెలికం రంగ సంస్థలు టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతున్నాయి. జనవరి 2022లో 5జీ టెస్ట్‌బెడ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని..
5G Technology: టెలికం రంగ సంస్థలు టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతున్నాయి. జనవరి 2022లో 5జీ టెస్ట్‌బెడ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని టెలికం శాఖ కార్యదర్శి రాజరామన్ అన్నారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్‌ఎంఈ)లతోపాటు పరిశ్రమలోని ఇతర సంస్థలు తమ సొల్యూషన్స్‌ను టెస్ట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఈ 5జీ టెస్ట్‌బెడ్ అవసరం. అయితే సుమారు రూ.224 కోట్లతో 5జీ టెస్ట్‌బెడ్‌ను రూపొందించేందుకు 2018లో కేంద్ర టెలికం శాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ టెస్ట్‌బెడ్‌పై ఆయా కంపెనీలు తమ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్‌వర్క్ కన్ఫిగరేషన్లను పరీక్షించుకోవచ్చు. ఈ టెస్ట్‌బెడ్‌ను జనవరిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
రూ.224 కోట్లతో దేశీ 5జీ టెస్ట్‌బెడ్: 5జీ టెక్నాలజీ కోసం ప్రయత్నాలు ముమ్మరం జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం 5జీ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్‌ఎల్ సంస్థలకు టెలికం శాఖ స్పె్క్ర్టం కేటాయించింది. ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల్లోని ఐఐటీ విద్యాసంస్థలు, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ వైరల్‌లెస్ టెక్నాలజీ ఇందులో పాల్గొంటున్నాయి.
ఇవి కూడా చదవండి: