Block ATM Card: మీ బ్యాంకు ఏటీఎం కార్డు ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేయాలని అనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

Block ATM Card: ప్రస్తుతం బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు జరిపే వారి సంఖ్య తగ్గిపోయింది. మొత్తం డిజిటల్‌ మయం అయిపోయింది. అయితే డెబిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌..

Block ATM Card: మీ బ్యాంకు ఏటీఎం కార్డు ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేయాలని అనుకుంటున్నారా..? ఇలా చేయండి..!
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Dec 09, 2021 | 6:20 AM

Block ATM Card: ప్రస్తుతం బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు జరిపే వారి సంఖ్య తగ్గిపోయింది. మొత్తం డిజిటల్‌ మయం అయిపోయింది. అయితే డెబిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలు భారీగా జరుగుతున్నాయి. ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం, ఆన్‌లైన్‌లో ఆర్డర్ల కోసం డెబిట్‌ కార్డులను ఉపయోగించడం జరుగుతున్నాయి. అయితే డెబిట్‌ కార్డులు వేరే వారికి చిక్కినప్పుడు లేదా హ్యాకర్లు కార్డును హ్యాక్ చేసి అన‌ధికారిక ఆన్‌లైన్ లావాదేవీల‌కు కూడా వీటిని ఉప‌యోగించవచ్చు. అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్‌ల ద్వారా కూడా డెబిట్‌ కార్డు దుర్వినియోగం కూడా జరుగుతున్నాయి. మోసగాళ్ల చేతిలో చిక్కి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా మోసం జరిగితే వెంటనే డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేయించి మరింతగా నష్టపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా డెబిట్‌ కార్డు మోసం జరిగినప్పుడు, లేదా మీ కార్డు పోగొట్టుకున్నప్పుడు ముందు జాగ్రత్తగా కస్టమర్‌కేర్‌ను సంప్రదించి కార్డును బ్లాక్‌ చేస్తుంటాము. అలా కాకుండా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా మీరు డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోయినప్పుడు కార్డు బ్లాక్‌ చేయండిలా..

► ముందుగా కస్టమర్‌ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లాగిన్‌ కావాలి.

► ఆ తర్వాత ఈ-సర్వీసెస్‌ ట్యాబ్‌ కింద ఏటీఎం కార్డు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

► ఏటీఎం/ డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేయాల్సిన ఖాతాను ఎంచుకోవాలి.

► ఆ తర్వాత బ్లాక్‌ చేసే కార్డు మొదటి 4 అంకెలు, చివరి 4 అంకెలు స్క్రీన్‌ పై కనిపిస్తుంటాయి. బ్లాక్‌ చేయాల్సిన కార్డును ఎంచుకుని వివరాలు ధృవీకరించిన తర్వాత సబ్‌మిట్‌ పై నొక్కాలి.

► ఆ తర్వాత ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ లేదా మీ ఫోన్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి కన్ఫర్మ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

► ఈ ప్రక్రియ విజయవంతం అయిన తర్వాత ఒక నంబర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం ఈ నంబర్‌ను గుర్తించుకోవడం ముఖ్యం.

Sbi

ఇవి కూడా చదవండి:

Rs 2000 Notes: క్రమంగా తగ్గిపోతున్న 2000 రూపాయల నోట్ల చలామణి.. నిలిచిపోయిన ముద్రణ.. నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ

Credit, Debit Cards: మీ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డును లాక్‌ చేసుకోవడం ఎలా..? కార్డును ఎలా సెట్‌ చేసుకోవాలి..!