Credit, Debit Cards: మీ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డును లాక్‌ చేసుకోవడం ఎలా..? కార్డును ఎలా సెట్‌ చేసుకోవాలి..!

Credit Card: ప్రస్తుతం డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకు మోసాలు కూడాపెరిగిపోతున్నాయి. అలాగే క్రెడిట్‌ కార్డుల ఉపయోగంలో పరిమితికి..

Credit, Debit Cards: మీ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డును లాక్‌ చేసుకోవడం ఎలా..? కార్డును ఎలా సెట్‌ చేసుకోవాలి..!
Follow us

|

Updated on: Dec 07, 2021 | 5:53 AM

Credit Card: ప్రస్తుతం డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకు మోసాలు కూడాపెరిగిపోతున్నాయి. అలాగే క్రెడిట్‌ కార్డుల ఉపయోగంలో పరిమితికి మించి ఖర్చు చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఎక్కువగా ఖర్చు చేయడమే కాదు.. ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మీరు కార్డు నుంచి చేస్తున్న ఖ‌ర్చుల‌ను అదుపులో పెట్టుకోవ‌డానికి మీ క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీల‌పై ప‌రిమితిని మీరే సెట్ చేసుకోవ‌చ్చు. ఎలాగంటే.. ఉదాహ‌ర‌ణ‌కి మీరు కార్డు ఉప‌యోగించిన ప్రతిసారి రూ.5 వేలు లేదా రూ.10 వేలు మించి లావాదేవీలు చేయ‌కూడ‌దు అనుకుంటే, దానికి తగినట్లుగా పరిమితిని ఏర్పాటు చేసుకునేలా చేసుకోవచ్చు. అంత‌కు మించి చేసే లావాదేవీలు విఫ‌ల‌మ‌వుతాయి. అంత‌ర్జాతీయ లావాదేవీలను నియంత్రించుకునే అవ‌కాశం కూడా అందుబాటులో ఉంది.

కార్డును ఎలా సెట్ చేయాలి?

కార్డు పరిమితిని ఏర్పర్చుకునే విధానం బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కార్డుపై ఉన్న బటన్‌ను స్విచ్‌ ఆన్‌ చేయడం ద్వారా అనుమతిస్తే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా ప‌రిమితిని ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. మీరు కార్డు ఆప్షన్‌కు వెళ్లి ప‌రిమితి విధించాల‌నుకుంటున్న కార్డు వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. దేశీయ లావాదేవీల కోసం లేదా అంత‌ర్జాతీయ లావాదేవీల కోసం ప‌రిమితి ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారా? లేదా ఇత‌ర మార్పులు ఏమైనా చేయాల‌నుకుంటున్నారా? అన్న ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు కావ‌ల‌సిన ఆప్షన్‌ ఎంచుకుని లిమిట్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా లిమిట్‌ను సెట్ చేసుకునే సదుపాయాన్ని కొన్ని బ్యాంకులు క‌ల్పిస్తున్నాయి. ఒకసారి ఆప్షన్ ఎనేబుల్ చేసిన త‌ర్వాత బ్యాంకు పరిమితి విధించిన సంగతి మీకు తెలియజేస్తుంది. తర్వాత లావాదేవీలు ప‌రిమితికి మించితే బ్యాంకు మీకు సమాచారం అందజేస్తుంది.

మోసాలను అరికట్టేందుకు..

డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసాల‌ను అరిక‌ట్టేందుకు బ్యాంకులతో పాటు మ‌నం కూడా త‌గిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రత్యేకించి మీ పాస్‌వర్డ్‌, పిన్ వంటి వివ‌రాల‌ను ఎవ‌రితోనూ పంచుకోకపోవడం మంచిది. మీ కార్డు విత్‌డ్రా లిమిట్‌ను ప‌రిమితం చేయండి. ఉదాహ‌ర‌ణ‌కు మీ కార్డు అంత‌ర్జాతీయ లావాదేవీల‌ను రద్దు చేసి, దేశీయంగా ఒక‌సారి చేసే లావాదేవీల‌ను రూ.5 వేల‌కు ప‌రిమితం చేశార‌నుకుందాం. అంత‌ర్జాతీయంగా మోసాల‌కు పాల్పడే వారు మీ కార్డు వివ‌రాల ద్వారా లావాదేవీలు నిర్వహించే వీలు ఉండదు. అలాగే దేశీయంగా మోసాల‌కు పాల్పడితే రూ.5 వేలకు మించి న‌ష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి:

PM Mudra Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న కేంద్ర సర్కార్‌ పథకం.. ఇందులో దరఖాస్తు చేసుకుంటే రూ.10 లక్షల రుణం!

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు రూ.5 వేలు..!

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!