Rs 2000 Notes: క్రమంగా తగ్గిపోతున్న 2000 రూపాయల నోట్ల చలామణి.. నిలిచిపోయిన ముద్రణ.. నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ
Rs 2000 Notes: ప్రస్తుతం చెలమణిలో ఉన్న 2000 రూపాయల నోట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ ఏడాది నవంబర్‌లో చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్ల సంఖ్య..
Rs 2000 Notes: ప్రస్తుతం చెలమణిలో ఉన్న 2000 రూపాయల నోట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ ఏడాది నవంబర్‌లో చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్ల సంఖ్య 223.30 కోట్లకు తగ్గింది. చలామణిలో ఉన్న నోట్లలో ఇది దాదాపు 1.75 శాతం. మార్చి 2018 లో కరెన్సీ చలామణిలో ఉన్న రెండువేల రూపాయల నోట్ల సంఖ్య 336.3 కోట్లు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఒక్క 2000 రూపాయల నోటు కూడా ముద్రించలేదు. 2016 నవంబర్ 8న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. రద్దు చేసిన నోట్ల స్థానంలో రూ.2000, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. అనంతరం రూ.200 నోట్లను కూడా తీసుకుకొచ్చింది. కానీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఆ స్థానంలో రూ.2000 విలువైన నోట్లు చలామణిలోకి తీసుకువచ్చిన తర్వాత క్రమ క్రమంగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. అంతేకాకుండా 2018-19 తర్వాత కొత్తగా రూ.2000 నోట్ల ముద్రణ కూడా నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.
2000 నోట్ల సంఖ్య క్రమంగా తగ్గింది
మార్చి 30, 2018 నాటికి మొత్తం కరెన్సీ చలామణిలో 2000 విలువైన నోట్లు 3362 మిలియన్ నోట్లు ఉన్నాయని అప్పటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. వాల్యూమ్ పరంగా ఇది 3.27 శాతంగా ఉంది. వాణిజ్యపరంగా ఈ విలువ 37.26 శాతంగా ఉంది. 26 ఫిబ్రవరి 2021న 2000 నోట్ల సంఖ్య 2499 మిలియన్లకు తగ్గింది. ఇది మొత్తం నోట్లలో 2.01 శాతం మరియు విలువలో 17.78 శాతంగా ఉంది.
Number of Rs 2,000 currency notes in circulation has decreased to 223.3 crore pieces or 1.75 per cent of total notes in circulation in November this year, compared to 336.3 crore pieces in March 2018: Govt
— Press Trust of India (@PTI_News) December 7, 2021
ఇవి కూడా చదవండి: