Viral News: నిజాయితీకి నిలువుటద్దం ఈ చిన్నారులు.. వీరు చేసిన పని తెలిస్తే మీరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Viral News: జీవితంలో నిజాయితీగా జీవించాలని, అదే మనల్ని రక్షిస్తుందని చెబుతుంటారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు, గురువులు ఇదే విషయాన్ని చెప్పి చిన్నారులను పెంచుతుంటారు. అయితే...
Viral News: జీవితంలో నిజాయితీగా జీవించాలని, అదే మనల్ని రక్షిస్తుందని చెబుతుంటారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు, గురువులు ఇదే విషయాన్ని చెప్పి చిన్నారులను పెంచుతుంటారు. అయితే ఎంత మంది ఈ విషయాలను సీరియస్‌గా తీసుకొని జీవితానికి అప్లై చేస్తారు చెప్పండి. ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తుంటాం. రోడ్డు పక్కన డబ్బులు దొరుకుతాయి.. ఏం చేస్తాం ఎవరూ చూడట్లేదని గమనించి వెంటనే జేబులో వేసేసుకుంటాం. మనలో చాలా మంది ఇలానే చేస్తారు. అయితే విలువలు తెలిసిన వారు మాత్రం అలా చేయరు. తాజాగా కేరళకు చెందిన ముగ్గురు చిన్నారులు చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని మెరికులం గ్రామంలో ఉన్న సెయింట్ మేరీస్ యూపీ స్కూల్‌లో జ్యోస్నా గ్రేస్, శ్రీలక్ష్మీతో పాటు ఆమె సోదరి శ్రీకుట్టీ అనే ముగ్గురు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల వీరు ముగ్గురు స్కూల్ నుంచి ఇంటికి వెళుతోన్న సమయంలో మట్టుక్కట్ట అనే ప్రాంతంలో వీరికి 50 వేల రూపాయలు కనిపించాయి. అయితే ఆ చిన్నారులు వెంటనే ఆ విషయాన్ని అక్కడే ఉన్న ఓ పరిచయస్తుడికి చెప్పారు. దీంతో డబ్బులు దొరికిన ప్రాంతానికి సమీపంలో ఉన్న మెడికల్ షాప్ యజమానికి ఈ విషయం చెప్పగా.
ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ ఆధారంగా అవి స్థానికంగా ఉన్న పంచాయతీ సభ్యుడివని గుర్తించాడు. దీంతో వెంటనే అతనికి డబ్బులు అందించారు. చిన్నారుల నిజాయితీ తెలసుకున్న స్థానికులు వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్కూలు యాజమాన్యం ఈ ముగ్గురిని విద్యార్థుల సమక్షంలో సత్కరించారు.
Also Read: రైల్వే ట్రాక్‌లపై కంకరాళ్లను ఎందుకు వేస్తారు.. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకోండి..
Viral Video: అర్ధరాత్రి అనుకోని అతిధి !! ఆ మహిళ ఏంచేసిందో తెలిస్తే !! వీడియో
స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమా తీశారు !! ఓటీటీలో రిలీజ్ చేశారు !! వీడియో