AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot Benefits: వింటర్‌లో క్యారెట్ తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

Carrot Health Benefits: భూమి లోపల లభించే దుంపలు తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు. ఇవి జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. అలాంటి వేరు

Carrot Benefits: వింటర్‌లో క్యారెట్ తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Carrot Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Dec 08, 2021 | 8:59 AM

Share

Carrot Health Benefits: భూమి లోపల లభించే దుంపలు తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు. ఇవి జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. అలాంటి వేరు కూరగాయలలో ఒకటి క్యారెట్. ముఖ్యంగా శీతాకాలంలో లభించే క్యారెట్‌లను తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇవి రుచితోపాటు ఎన్నో పోషక గుణాలతో నిండిఉంటాయి. వీటిని పలు వంటలలో ఉపయోగించవచ్చు. శీతాకాలపు ఆహారంలో క్యారెట్ కూడా ముఖ్యమైనది. క్యారెట్‌లు పలు రకాల రంగులలో లభిస్తాయి. మీరు ఏ క్యారెట్ తీసుకున్నా.. పలు వ్యాధుల నుంచి దూరంగా ఉంచవచ్చు.

భారతదేశంలో క్యారెట్ ఉత్పత్తితోపాటు విక్రయాలు కూడా మంచిగా జరుగుతాయి. వీటితో.. గజర్ కా హల్వా, గజర్ పరాఠా, క్యారెట్ సూప్, గజర్ బర్ఫీ, గజర్ కా మురబ్బా, క్యారెట్ చట్నీ, క్యారెట్ కేక్ లాంటి వంటకాలు చేసుకోవచ్చు. అయితే.. క్యారెట్‌తో మీ చర్మానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి తెలుసుకుందాం..

క్యారెట్ శరీరానికి ఎందుకు ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కంటి చూపుకు మేలు చేస్తుంది.. క్యారెట్ కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో విటమిన్ ఎ స్థాయిని పెంచుతుంది. ఇది మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

2. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర సామర్థాన్ని పెంచి.. వైద్య పరిస్థితులతో పోరాడటానికి సహాయపడతాయి. క్యారెట్‌లో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్ కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

3. గుండె ఆరోగ్యానికి దివ్యౌషధం క్యారెట్ మీ గుండెకు బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. గుండె జబ్బులు ఉన్నవారు క్యారెట్‌ని తప్పక తినాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు ప్రత్యేక రక్షణనిస్తాయి. ఇవే కాకుండా క్యారెట్‌లో పొటాషియం, ఫైబర్ కూడా ఉంటాయి. అంతేకాదు రెడ్ క్యారెట్‌లో లైకోపిన్ కూడా ఉంటుంది. ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.

4. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయండి క్యారెట్ తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. క్యారెట్‌లో ఉండే విటమిన్ సి మీ శరీరంలో యాంటీబాడీలను తయారు చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో శరీరాన్ని సిద్దం చేస్తుంది.

5. క్యారెట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది మీకు మలబద్ధకం సమస్య ఉంటే పచ్చి క్యారెట్ తింటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్న రోగులు ఎల్లప్పుడూ పచ్చి క్యారెట్లను తినాలని సూచిస్తున్నారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది.

6. మధుమేహ రోగులకు సూపర్ ఫుడ్.. క్యారెట్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా క్యారెట్ తినాలి. క్యారెట్‌లో ఉండే ఫైబర్ రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెరను నిర్వహించడానికి సహాయపడుతుంది.

7. ఎముకలను బలోపేతం చేయండి మీరు క్యారెట్ ప్రతిరోజూ తీసుకుంటే మీ ఎముకలను స్ట్రాంగ్ గా మారుతాయి. క్యారెట్‌లో కాల్షియం, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి రెండు ఎముకలకు చాలా ముఖ్యం.

Also Read:

Hair Care: తల దురదతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా.. ఈ చిట్కాలు పాటించి చూడండి!

Cooking Food: మన అమ్మమ్మలు అంత ఆరోగ్యంగా ఎందుకున్నారో తెలుసా? వారి ఆరోగ్య రహస్యం వంట గదిలోనే ఉందంటే నమ్ముతారా?