Beetroot Side Effects: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‏రూట్ తింటే ప్రమాదమే.. ఎందుకంటే..

బీట్‏రూట్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. బీట్‏రూట్ శాస్త్రీయ నామం బేట వల్గురీస్. దీనిని రోజూ తీసుకుంటే

Beetroot Side Effects: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‏రూట్ తింటే ప్రమాదమే.. ఎందుకంటే..
Beetroot
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 08, 2021 | 9:58 AM

బీట్‏రూట్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. బీట్‏రూట్ శాస్త్రీయ నామం బేట వల్గురీస్. దీనిని రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించడంలోనూ బీట్‏రూట్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ బీట్‏రూట్ తినాలి.

కంటి చూపు సమస్యలను తగ్గించడంలోనూ బీట్‏రూట్ సహాయపడుతుంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. అనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పు బీట్‌రూట్‌ రసం తాగితే త్వరగా సమస్య నుంచి బయటపడతారు. అయితే ఎన్నో ప్రయోజనాలు అందించే బీట్‏రూట్ కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‏రూట్ తీసుకోవడం వలన హానికరంగా మారుతుంది.

బీట్‏రూట్ తినడం వలన రక్తపోటు ఉన్నవారికి ప్రమాదం. బీట్‏రూట్ తినడం వలన రక్తపోటు మరింత తగ్గుతుంది. ఈ అనారోగ్య సమస్య ఉన్నవారు బీట్‏రూట్ తినకూడదు. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా బీట్‏రూట్ తీసుకోవద్దు. గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీట్‏రూట్ తినకూడదు. ఇందులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది.

అలెర్జీ, చర్మం పై దద్దుర్లు వంటి సమస్యలు ఉన్నవారు బీట్‏రూట్ తినకూడదు. ఇది అలెర్జీలు, చర్మంపై దద్దుర్ల సమస్యను మరింత పెంచుతుంది. అలాగే మధుమేహ రోగులు కూడా బీట్‏రూట్ తినకూడదు. డయబెటిక్ సమస్యను మరింత పెంచుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

Also Read: AR Rahman: నా కూతుర్లకు నేను ఇచ్చే సలహా అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్..

Sudigali Sudheer: జబర్దస్త్‏ను వీడనున్న సుడిగాలి సుధీర్ టీం.. స్జేట్ పైనే ఎమోషనల్ కామెంట్స్..

Payal Rajput: పాయల్ రాజ్‏పుత్‏ను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..