AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajwain Benefits: వాముతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. చలికాలంలో ఎలా తీసుకుంటే మంచిదో తెలుసా..?

Celery Seed Benefits: వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో వాము కూడా ఒకటి. వాము గింజల్లో ఎన్నో ఔషధాలున్నాయి. మంచి సువాసన కలిగిన ఈ మసాలా గింజలు.. ఆహారం రుచితోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను

Ajwain Benefits: వాముతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. చలికాలంలో ఎలా తీసుకుంటే మంచిదో తెలుసా..?
Ajwain Benefits
Shaik Madar Saheb
|

Updated on: Dec 08, 2021 | 2:09 PM

Share

Celery Seed Benefits: వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో వాము కూడా ఒకటి. వాము గింజల్లో ఎన్నో ఔషధాలున్నాయి. మంచి సువాసన కలిగిన ఈ మసాలా గింజలు.. ఆహారం రుచితోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే.. చలికాలంలో వాము బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వాము గింజల్లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లాంటివి పుష్కలంగా ఉనన్నాయి. వాములో.. ఉండే థైమోల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి దగ్గు, జలుబుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కల్పించడంలో సహాయపడతాయి. దీంతోపాటు ఈ విత్తనాలు జీర్ణ, శ్వాసకోశ సమస్యలను నయం చేస్తాయి. వామును నిత్యం తీసుకోవడం ద్వారా పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. వామును పలు రకాలుగా ఉపయోగించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ మార్గాల్లో వామును ఉపయోగించడం చాలా మంచిది. వాము మూలికా పానీయం.. వామును వంటల్లో మసాలాగా లేదా మూలికా పానీయంగా ఉపయోగించవచ్చు. వామును ఉపయోగించి డిటాక్స్ డ్రింక్ తయారు చేయవచ్చు. ఇది కడుపుని శుభ్రపరచడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ డిటాక్స్ డ్రింక్ తయారు చేయడం చాలా సులభం. ఇందుకోసం వాము గింజలను నీటిలో వేసి మరిగించాలి. నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. మీరు దీన్ని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇది మంచి పానీయం.

వామును నానబెట్టి.. ఈ పానీయాన్ని తయారు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే రాత్రంతా నీటిలో నానబెట్టాలి. అలాగే ఉదయాన్నే కొంచెం వేడి చేసి తాగడం చాలా మంచిది. డిటాక్స్‌గా ఉపయోగించడానికి మరొక మార్గం ఏమిటంటే.. వాము గింజలను కాల్చి పౌడర్‌లా చేసుకోవాలి. ఆ తర్వాతా ప్రతి రోజూ.. గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే చాలామంచింది. ఒకటి లేదా రెండు గ్లాసుల వాము నీరు తీసుకోవడం మంచిది. ఇంకా.. వాము విత్తనాల్లో రాక్ ఉప్పును జోడించి తీసుకుంటే చాలామంచిది.

అజ్వైన్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ మసాజ్ జలుబు, దగ్గు చికిత్స/నివారణ కోసం వాను నూనెను ఇంటి నివారణగా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో ఆవాల నూనె వేసి.. దానిలో కొంచెం వామును జోడించి బాగా మరిగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. దానిని ఒక కూజాలో నిల్వ చేయాలి. చిన్నారులకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఛాతీ, మెడ, వీపుపై మసాజ్ చేస్తే వాటినుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ పద్ధతి 8-10 నెలల వయస్సులోపు పిల్లలకు మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది.

Also Read:

Carrot Benefits: వింటర్‌లో క్యారెట్ తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

Beetroot Side Effects: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‏రూట్ తింటే ప్రమాదమే.. ఎందుకంటే..