AR Rahman: నా కూతుర్లకు నేను ఇచ్చే సలహా అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్..

పిల్లలు ఎదగడం.. వారు అనుకున్న దారిలో వెళ్లి కలలను నిజం చేసుకోవడానికి తల్లిదండ్రుల సహాకారం ఎంతో అవసరం.

AR Rahman: నా కూతుర్లకు నేను ఇచ్చే సలహా అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్..
Ar Rahman
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 08, 2021 | 9:42 AM

పిల్లలు ఎదగడం.. వారు అనుకున్న దారిలో వెళ్లి కలలను నిజం చేసుకోవడానికి తల్లిదండ్రుల సహాకారం ఎంతో అవసరం. తమ పిల్లల ఎదుగుదలను చూసి మురిసిపోతుంటారు. సామాన్యులైనా.. సెలబ్రెటీలు అయినా.. తమ పిల్లలు సాధించిన పనుల గురించి చెప్పుకోవడానికి గౌరవంగా భావిస్తుంటారు. తల్లిదండ్రులకు అంతకు మించిన మంచి అనుభూతి మరోకటి ఉండదనే చెప్పుకోవాలి. ఇప్పుడు అదే అనుభూతిని పొందుతున్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత.. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన కూతుర్లు రహీమా రెహమాన్, ఖతీజా రెహమాన్ ఇద్దరూ సంగీతకారులుగా రాణిస్తున్నారు.

ఇటీవల కృతి సనన్ నటించిన మిమి సినిమాలో రాక్ ఏ బై బేబీ పాటతో అదరగొట్టారు ఖతీజా. తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో తన కూతుర్ల గురించి స్పందించాడు ఏఆర్ రెహమాన్. వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా మీ కూతుర్లకు ఏమైనా సలహా ఇస్తారా అని అడగ్గా.. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. రహీమా, ఖతేజా ఇద్దరిదీ మొండీ మనస్తత్వం. వాళ్లు ది బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో వాళ్లకు నేను పదే పదే చెప్పె విషయం ఒకటే. దేని గురించి దిగులు చెందకండి. చేయాలనుకున్న పనిని చేయండి. అప్పుడే మీకంటూ సొంత వ్యక్తిత్వం అలవడుతుంది. ఇతరులతో పోల్చుకోవద్దు అని చెబుతాను. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు 30-60 ఏళ్ల వయసు వాళ్లతో పనిచేశాను. వాళ్లందరి నుంచి నేను నేర్చుకున్న విషయమేంటంటే పని పట్ల నిబద్దత. ఇప్పుడు కూడా అదే విషయాన్ని తిరిగి యూత్ నుంచి నేర్చుకుంటున్నా. యువతలో ఉండే ఉత్సాహం నన్ను ప్రేరేపిస్తుంది. వారితో కలిసి పనిచేస్తుంటే అప్పటి క్షణాలను ఆస్వాదిస్తున్నా అన్నారు ఏఆర్ రెహమాన్.

Also Read: Ram Charan: ఉపాసన చెల్లెలు పెళ్లిలో రానా దంపతుల సందడి.. ఫోటోస్ షేర్ చేసిన రామ్ చరణ్..

Sudigali Sudheer: జబర్దస్త్‏ను వీడనున్న సుడిగాలి సుధీర్ టీం.. స్జేట్ పైనే ఎమోషనల్ కామెంట్స్..

Prabhas: మొదలైన ప్రభాస్‌ – నాగ అశ్విన్‌ చిత్రం.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో దీపిక సందడి..

Payal Rajput: పాయల్ రాజ్‏పుత్‏ను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..