AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: మొదలైన ప్రభాస్‌ – నాగ అశ్విన్‌ చిత్రం.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో దీపిక సందడి..

Prabhas: బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషన్‌ హీరోగా మారారు హీరో ప్రభాస్‌. ఇప్పుడు ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే అది టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతోంది. ప్రభాస్‌ స్టామినా ఎప్పుడో..

Prabhas: మొదలైన ప్రభాస్‌ - నాగ అశ్విన్‌ చిత్రం.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో దీపిక సందడి..
Prabhas Project K
Narender Vaitla
|

Updated on: Dec 08, 2021 | 8:06 AM

Share

Prabhas: బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషన్‌ హీరోగా మారారు హీరో ప్రభాస్‌. ఇప్పుడు ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే అది టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతోంది. ప్రభాస్‌ స్టామినా ఎప్పుడో టాలీవుడ్‌ను దాటేసి బాలీవుడ్‌కు చేరింది. ఇక అక్కడితో ఆగకుండా పాన్‌ వరల్డ్‌ రేంజ్‌కి ప్రభాస్‌ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న కొన్ని సినిమాలు ఇతర దేశాల్లోనూ విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ప్రేక్షకులకు ముందుకు వస్తోన్న మరో చిత్రం ప్రభాస్‌-నాగఅశ్విన్‌ల కాంబినేషన్‌లో వస్తోంది. ప్రాజెక్ట్‌-కే అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్‌ ఇటీవలే ప్రారంభించింది.

ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌ చిత్రాలతో బిజీగా ఉండడంతో మొదటగా దీపికాపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే నటి దీపికా పదికొణె ఇటీవల హైదరాబాద్‌ బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రయూనిట్‌ దీపికాకు పసుపు కుంకుమలతో వెల్‌కమ్‌ చెబుతున్నట్లు ఉన్న ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ నెల 5న అన్నపూర్ణ స్టూడియోలో మొదలు పెట్టారు.

అయితే ఈ షెడ్యూల్‌ను కేవలం కొన్ని రోజులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ నెల 15 నుంచి దీపికా బాలీవుడ్‌ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో అంతలోపు పది రోజులు ప్రాజెక్ట్‌ కేలో పాల్గొని ఆ తర్వాత దీపికా మళ్లీ ముంబయి బాట పట్టనున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్‌ నటిస్తోన్న చిత్రాలన్నీ పూర్తికాగానే నాగ అశ్విన్‌ చిత్రీకరణ వేగవంతం చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దీపిక, అమితాబ్ వంటి బాలీవుడ్ స్టార్స్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా టైమ్ మిషిన్ నేపథ్యంలో  సైన్స్ ఫిక్షన్‌ చిత్రంగా తెరకెక్కనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: Shriya Saran: నా ఈ 20 ఏళ్ల ప్రయాణానికి అదే కారణం.. సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీయ..

Virat Kohli: కోహ్లికి డ్యాన్స్ నేర్పిన చాహల్ భార్య !! వైరలవుతోన్న వీడియో

కాటేసిన పాము !! పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ !! చివరికి ఏమైందంటే ?? వీడియో